Go to full page →

ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, వ్యక్తిగత సేవ ChSTel 139

ఎవరోవ్యక్తి చిత్తశుద్ధితో దేవుని దీవెనను అన్వేషిస్తున్నందువల్ల సంపూలు పునరుజ్జీవం పొందుతాయి. అతడు దేవుని కోసం ఆకలిదప్పులుగొని విశ్వాసంతో అడిగి దాని ప్రకారం పొందుతాడు. ప్రభువుపై తన ఆధారాన్ని గుర్తించి చిత్తశుద్ధితో పనిచేస్తాడు. అలాంటి దీవెనల్ని అన్వేషించటానికి ఆత్మలు మేలుకుంటాయి. మనుషుల హృదయాలు తెప్పరిల్లే కాలం చోటు చేసుకుంటుంది. విస్తృత సేవను అలక్ష్యం చెయ్యటం జరగదు. సరైన సమయంలో విస్తృత ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అయితే వ్యక్తిగతమైన, వైయ్యక్తిమైన కృషి, మీ మిత్రులు ఇరుగు పొరుగు వారిపట్ల మీ ఆసక్తి, అనుకున్నదానికన్నా ఎక్కువ సాధిస్తుంది. ఈ సేవ జరగని కారణంగా క్రీస్తు ఎవరికోసం మరణించాడో వారు నశిస్తున్నారు. ChSTel 139.2

ఒక్క ఆత్మ విలువ అమూల్యం. దీని విలువ కల్వరి చెబుతున్నది. సత్యాన్ని స్వీకరించిన ఒక్క ఆత్మ ఇతరుల్ని రక్షించటానికి సాధనమౌతుంది. దీవెన రక్షణ ఫలం, నిత్యం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత పరిచర్య లోపించిన భారీ సమావేశాలు సాధించే మేలు కన్నా మి పని ఎక్కువ మేలు సాధించవచ్చు. దేవుని దీవెనతో ఈ రెండూ మిళితమైనప్పుడు మరింత మెరుగైన, సంపూర్ణమైన సేవను చెయ్యవచ్చు. కాని ఒకదాన్నే మనం చెయ్యగలిగితే, అది కుటుంబానికి లేఖనాల్ని పరిచయం చెయ్యటం, వ్యక్తిగత విజ్ఞప్తి చెయ్యటం, కుటుంబ సభ్యులతో చనువుగా మాట్లాడటం - చిన్నచిన్న ప్రాముఖ్య విషయాల గురించి కాక రక్షణకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడటం - వంటి వ్యక్తిగతమైన సేవ చెయ్యాలి. మీ హృదయం ఆత్మల రక్షణ భారంతో కుంగిపోతున్నట్లు వారిని చూడ నివ్వండి. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 13, 1888. ChSTel 140.1