Go to full page →

ఉపయోగ్యమైన ప్రాథమికాలతో పనిచెయ్యండి ChSTel 145

పౌలు వాగ్ధాటిగల ప్రసంగికుడు. క్రీస్తు అనుచరుడిగా మారకముందు అతడు తన వక్తృత్వంతో తన శ్రోతల్ని ఆకట్టుకోటానికి ప్రయత్నించేవాడు. కాని ఇప్పుడు దానంతటిని పక్కన పెట్టాడు. కవితావర్ణనలు, జ్ఞానేంద్రియాల్ని తృప్తి పర్చి ఊహను పెంచి అనుదిన అనుభవాన్ని స్పృశించని కల్పిత చిత్రీకరణల బదులు, అతి ప్రాముఖ్యమైన సత్యాల్ని సామాన్య మాటల్లో హృదయానికి బోధపర్చటానికి పౌలు ప్రయత్నించాడు. సత్యాన్ని గూర్చిన ఊహా చిత్రీకరణ ఆనంద పారవశ్యం కలిగించవచ్చు. కాని ఈ రీతిగా సమర్పితమైన సత్యాలు జీవిత పోరాటానికి అవసరమైన శక్తినిచ్చే ఆహారాన్ని విశ్వాసికి సరఫరా చెయ్యలేవు. పెనుగులాడుతున్న ఆత్మల ప్రస్తుతావసరాలు, ప్రస్తుత శ్రమలు - వీటిని క్రైస్తవమతంలోని ప్రాథమిక నియమాల పై ప్రయోగాత్మకమైన ఉపదేశం ఇవ్వటం ద్వారా ఎదుర్కోవాలి. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 251, 252. ChSTel 145.2