Go to full page →

ప్రయాణ మార్గాల్లో ప్రతినిధులు ChSTel 146

ప్రభువు పిలుపుకి స్పందిస్తూ సేవలో చేరినవారు ఆయన పనిచేసే పద్దతుల్ని అధ్యనం చెయ్యాలి. తన భూలోక సేవలో ప్రయాణ మార్గాల్లో సేవకున్న అవకాశాల్ని ఆయన ఉపయోగించుకున్నాడు. అటు ఇటూ తాను చేసిన ప్రయాణాల్లో యేసు కపెర్నహోములో ఉండేవాడు. అది ఆయన “సొంత పట్టణంగా పిలవబడేది. ఈ పట్టణం రక్షకుని సేవకు కేంద్రంగా ఉండటానికి అనుకూలంగా ఉంది. దమస్కునుంచి యెరూషలేము ఐగుప్తులకు, మధ్యధరా సముద్రానికి వెళ్లే మార్గంలో ఉండటంతో, అది గొప్ప ప్రయాణ మార్గమయ్యింది. అనేక దేశాలనుంచి ప్రజలు ఆ పట్టణం మీదుగా వెళ్లేవారు లేదా అటూ ఇటూ తమ ప్రయాణాల్లో ఆ పట్టనంలో ఆగేవారు. యేసు ఇక్కడ అన్ని జాతులు అన్ని తరగతుల ప్రజల్ని, గొప్ప వారు, పేదలు సామాన్యుల్ని కలవగలిగేవాడు. ఇలా ఆయన బోధనలు ఇతర దేశాలకి, అనేక గృహాల్లోకి తీసుకువెళ్లటం జరిగేది. ఈ రకంగా ప్రవచనాల్ని పరిశీలించటం, రక్షకుని మీదికి ప్రజల గమనం తిరగటం, ఆయన కర్తవ్యం లోకం ముందుకి రావటం జరగాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 121. ChSTel 146.1

ఆర్యోగ్యం ఆనందం వాంఛిస్తున్న ప్రజలతో కిటకిటలాడే లోక ప్రఖ్యాత ఆరోగ్య ఆశ్రమాల్లోను, పర్యాటక జన కేంద్రాల్లోను ప్రజాసమూహాల గమనాన్ని ఆకర్షించే సామర్థ్యంగల వాక్యపరిచారకుల్ని గ్రంథ విక్రయ సేవకుల్ని ఉంచాలి. ఈ పనివారు నేటివర్తమానాన్ని సమర్పించటానికి, అవకాశం కలిగినప్పుడు సువార్త సమావేశాలు జరుపటానికి తరుణం కోసం వేచి ఉండాలి. ప్రజలతో మాట్లాడటానికి అవకాశాల్ని దొరకబుచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో వారు బాప్తిస్మమిచ్చే యోహాను బోధించిన “పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి” అన్న వర్తమానాన్ని బోధించాలి. (మత్తయి 3:2). వినటానికి చెవులున్న వారు వినేందుకు దైవవాక్యాన్ని వారు స్పష్టంగాను శక్తితోను ప్రకటించాలి. నేటి సువార్త తెలియనివారికి ఇలా ప్రకటితమౌతుంది. అనేకమంది అంగీకరించి లోకంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తమ గృహాలకి ఆ వర్తమానాన్ని తీసుకువెళ్లారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 122. ChSTel 146.2

ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్ పర్యాటక కేంద్రాల్లో ఉపయోగించటానికి అనుకూలంగా తయారు చెయ్యబడ్డాయి. కాళీ సమయం, చదవాలన్న కోరిక ఉన్నవారి చేతుల్లో ఈ పుస్తకాల్ని పెట్టటానికి సాధ్యమైన దంతా చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 85. ChSTel 147.1

ఆరోగ్య భోజన హోటళ్లు, చికిత్స గదులు స్థాపితం కావాలి. “ప్రభువు మార్గము సిద్దపరచుడి” అంటూ బాప్తిస్మమిచ్చే యోహాను స్వరం అరణ్యంలో వినిచించిన రీతిగా గొప్ప పర్యాటక కేంద్రాల్లోను, సముద్రం పక్క ఆశ్రమాల్లోను ప్రభువు దూతల స్వరం వినిపించాలి. టెస్టిమొనీస్, సం. 7 పులు. 55, 56. ChSTel 147.2