పని చెయ్యటానికి మనసుంటే మనుషులు చెయ్యటానికి ఎన్నో పనులున్నాయి. సత్యం వినటానికి గుడికి వెళ్లటం ఇష్టంలేని వారు అనేకులున్నారు. వ్యక్తిగత సామాన్య కృషి ద్వారా వీరిని దైవ మందిరానికి నడిపించటానికి ప్రయత్నించి సమ్మత పర్చవచ్చు. నేటి సత్యాన్ని గూర్చిన ప్రసంగం మొదటిసారిగా విన్నప్పుడు వారి మనసుల్లో విశ్వాసం పుట్టవచ్చు. వారు మా వినతిని తిరస్కరిస్తే నిరుత్సాహపడకండి. మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే వరకు ఓర్పుతో పని చెయ్యండి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 150.2