బాధల్లో ఉన్నవారి దుఃఖాన్ని క్రీస్తు పంచుకుంటాడు. దురాత్మలు మానవ దేహాన్ని, చీల్చినప్పుడు ఆ శాపాన్ని క్రీస్తు పంచుకుంటాడు. జ్వరం జీవన స్రవంతిని దహిస్తున్నప్పుడు ఆ వేదనను ఆయన పంచుకుంటాడు. వ్యక్తిగతంగా లోకంలో ఉన్నప్పటిలాగే ఇప్పుడు కూడా రోగుల్ని బాగు చెయ్యటానికి ఆయన సిద్దంగా ఉన్నాడు. క్రీస్తు సేవకులు ఆయన ప్రతినిధులు, ఆయన కార్యాలికి సాధనాలు. వారి ద్వారా తన స్వస్తతశక్తిని వినియోగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు. 823, 824. ChSTel 156.4
వ్యాధి బాధితులు, దురద్రుష్టవంతులు, దురాత్మలు పట్టినవారు తన సేవకుల ద్వారా తన స్వరం వినాలని దేవుడు సంకల్పించాడు. లోకం ఎన్నడు ఎరుగని రీతిగా, తన మానవ ప్రతినిధుల ద్వారా ఆదరణకర్తగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 106. ChSTel 157.1
వైద్య మిషనెరీ సేవలో నిమగ్నమైన వారితో క్రీస్తు సహకరిస్తాడు. టెస్టిమొనీస్, సం. 7, పు. 51. ChSTel 157.2
వారి ద్వారా ప్రభువు పని చేశాడు. వారు ఎక్కడకు వెళ్తే అక్కడ రోగుల్ని స్వస్తపర్చారు. బీదలకు సువార్త ప్రకటించారు. ది ఎక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 106. ChSTel 157.3
వ్యాధిగ్రస్తుల్ని స్వస్త పర్చుతూ మన పట్టణాలు పల్లెల్లో సంచరించటానికి క్రీస్తు వ్యక్తిగతంగా ఈ లోకంలో ఇకలేడు. అయితే తాను ప్రారంభించిన వైద్య మిషనెరీ సేవను మనం కొనసాగించి వృద్దిపర్చాలని ఆయన ఆజ్ఞాపించాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 168. ChSTel 157.4