Go to full page →

వంటక పరంపర ప్రణాళిక తిండిబోతు తనాన్ని రెచ్చగొడ్తుంది CDTel 131

(1905) M.H.306,307 CDTel 131.1

218. మాంసాహారాన్ని, హానికరమైన ఇతర ఆహార పదార్థాల్ని విడిచి పెట్టిన అనేకమంది, తమ ఆహారం సామాన్యమయ్యింది, ఆరోగ్యవంతమయ్యింది గనుక తాము అడ్డు ఆపు లేకుండా, అతిగా కొన్నిసార్లు తిండిబోతుతనంగా తినవచ్చునని భావిస్తారు. ఇది పొరపాటు. శరీర వ్యవస్థ పరిష్కరించటానికి శ్రమ అవసరమయ్యేంత పరిమాణంలోనే గాని నాణ్యత లోనేగాని ఆహారం తీసుకుని జీర్ణమండల అవయవాలకి భారం కలిగించకూడదు. CDTel 131.2

కొన్నిసార్లు అతి తిండి ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఇతర సందర్భాల్లో బాధ తెలియదు. కాని జీర్ణక్రియ అవయవాలు తమ ప్రధాన శక్తిని కోల్పోతాయి. భౌతిక శక్తి పునాది బలహీనమౌతుంది. CDTel 131.3

అదనపు ఆహారం శరీర వ్యవస్థకు భారమై వ్యాధి గ్రస్త జ్వరగ్రస్త పరిస్థిలులు పుట్టిస్తుంది. అది అవసరమైన దానికన్నా ఎక్కువ రక్తాన్ని అన్నకోశంలోకి రప్పిస్తుంది. కాళ్ళు చేతులు త్వరగా చల్లబడేటట్టు చేస్తుంది. జీర్ణమండల అవయవాల పై భారంగా ఉన్నట్లు, మందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిత్యం మితిమీరి తినేవారు దీన్ని అంతా పోయిన ఆకలి భావమంటారు. కాని అది జీర్ణమండల అవయవాలు ఎక్కువ పనిచేసినందువల్ల ఏర్పడ్డ పరిస్థితి, కొన్నిసార్లు మెదడు మొద్దుబారుతుంది. ఫలితంగా శారీరకంగా, మానసికంగా పనిచెయ్యటానికి ఇష్టముండదు. CDTel 132.1

ప్రకృతి తన జీవశక్తిని అనవసరంగా వినియోగించి తన పనిని ముగించి అలసిపోయింది కనుక ఈ అప్రియ లక్షణాలు కనిపిస్తాయి “నాకు విశ్రాంతి అవసరం” అని కడుపు అంటుంది. అయితే అనేకులికి ఈ శక్తిహీనత ఎక్కువ ఆహారానికి సంకేతంగా అర్థమౌతుంది. కనుక కడుపుకి విశ్రాంతి ఇచ్చే బదులు దానిపై మరింత భారం మోపుతారు. పర్యవసానంగా జీర్ణమండల అవయవాలు అవి సమర్థంగా పని చెయ్యాల్సిన సమయంలో తరచు బలహీనమౌతాయి. CDTel 132.2

[బాధ తెలియకపోయినా అవయవాలు వాటి జీవశక్తిని కోల్పోవచ్చు-155] CDTel 132.3

[దైవ సేవకులు ఆహారంలో మితం పాటించాలి-117] CDTel 132.4

[మితిమీరి తింటే ఇ.జి.వైట్ తన పనిపై దేవుని ఆశీర్వాదాలు అర్థించలేక పోయింది-ఎ పెన్ఎక్స్ 1:7] CDTel 132.5