Go to full page →

నోవహు దినాలు, మన దినాలు CDTel 144

[C.T.B.H.11, 12] (1890) C.H.23,24 CDTel 144.1

230. ఒలీవ కొండ పై కూర్చుని, తన రాకకు ముందు చోటు చేసుకోవలసిన గుర్తుల్ని గూర్చి యేసు తన శిష్యులుకి బోధిస్తున్నాడు: “జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వర కు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” నోవహు దినాల్లో దేవుని తీర్పులకు హేతువైన పాపాలే మన దినాల్లోనూ ప్రబలుతున్నాయి. ఆడవారేంటి మగవారేంటి ఆహారపానాల్ని ఎంత దూరం తీసుకు వెళ్తున్నారంటే అవి తిండిబోతుతనంగాను తాగుబోతుతనంగాను పరిణమిస్తున్నాయి. వికృతమైన తిండి వాంఛ అనే ఈ పాపం నోవహు దినాల్లో మనుషుల ఆవేశకావేషాల్ని రెచ్చగొట్టి దుర్మార్గాన్ని దుర్నీతిని విస్తరింపజేశాయి. దౌర్జన్యం పాపం ఆకాశాన్నంటుకున్నాయి. తుదకు ఈ నైతిక కల్మషాన్ని భూమి మీద నుంచి జల ప్రళయంతో తుడిచి వేయటం జరిగింది. తిండిబోతుతనం తాగుబోతుతనం అన్న ఆ పాపాలే సోదోమ నివాసుల నైతిక శక్తుల్ని ఎంతగా మొద్దుబార్చాయంటే ఆ దుర్మార్గ పట్టణ పురుషులు స్త్రీలకి నేరం ఆనందంగా కనిపించింది. క్రీస్తు లోకాన్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: “లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమునుండి అగ్నిగంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” CDTel 144.2

క్రీస్తు ఓ ముఖ్యమైన పాఠాన్ని మనకోసం దాఖలు చేస్తున్నాడు. తినటం తాగటం ప్రధానంగా పరిగణించటంలోని ప్రమాదాన్ని ఆయన మన ముందున్నాడు. అదుపులేని ఆహార వాంఛ ఫలితాల్ని ఆయన మన కళ్లకు కడుతున్నాడు. నైతిక శక్తులు బలహీనమవ్వటంతో పాపం పాపంలా కనిపించదు. ప్రజలు నేరాల్ని తీవ్రంగా పరిగణించరు. మనసు ఉద్రేకం నియంత్రణ కింద ఉంటుంది. మంచి నియమాలు మంచి భావోద్వేగాలు నిర్మూలమవుతాయి. ప్రజలు దేవదూషణకు పాల్పడతారు. ఇదంతా మితిమీరి తినటం వల్ల తాగటం వల్ల కలిగే దుష్పలితాలు. తన రాకడ సమయంలో ఇలాంటి పరిస్థితులే ప్రబలు తాయని క్రీస్తు తెలుపుతున్నాడు. CDTel 144.3

ఏమి తిందాం ఏమి తాగుదాం ఏమి ధరిద్దాం అన్నవాటికన్నా సమున్నతమైన దానికోసం మనం పాటుపడేందుకు రక్షకుడు దాన్ని మనకు సమర్పిస్తున్నాడు. తినటం తాగటం వస్త్రాలు ధరించటం అన్నవాటిని నేరమయ్యేంత అతిగా ప్రజలు ప్రేమిస్తున్నారు. అవి చివరి దినాల పాపాల్లో స్థానం పొంది క్రీస్తు త్వరితాగమనానికి గుర్తుగా రూపొందుతాయి. దేవుడు మనకప్పగించిన తన సమయాన్ని ద్రవ్యాన్ని బలాన్ని, శక్తిని తగ్గించి బాధను మరణాన్ని కలిగించే వ్యర్ధమైన దుస్తులు, విలాసాలు, వక్రరుచులకు మనం వ్యయం చేస్తాం. మన పాప శరీర కార్యాలు మన శరీరాల్ని అనీతితోను వ్యాధితోను ఎడతెగకుండా నింపుతున్నప్పుడు వాటిని దేవునికి సజీవ యాగంగా సమర్పించటం అసాధ్యం. CDTel 145.1

[C.T.B.H.42,43] (1890) C.H.108,110 CDTel 145.2

231. మానవుడు ఎదుర్కొనాల్సిన శక్తిమంతమైన శోధనల్లో ఒకటి ఆహారానికి సంబంధించినది. దేవుడు ఆదిలో మానవుణ్ని నీతిమంతుడుగా సృజించాడు. సంపూర్ణ సమతుల్యతగల మనసుతో సృజించాడు. అవయవాల పరిమాణం, శక్తి, పూర్తిగా సమరసంగా అభివృద్ధి చెందాయి. అయితే కపటి అయిన శత్రువు ప్రలోభం వల్ల దేవుడు విధించిన నిషేధాన్ని అతిక్రమించటం జరిగింది. ప్రకృతి చట్టాలు తమ శిక్షను అమలు పర్చా యి.... CDTel 145.3

తిండి వాంఛకు మొదటి లొంగుబాటు జరిగినప్పటినుంచి, మానవాళి స్వార్థ శరీరాశల తృప్తికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ పోతూ తుదకు ఆహారం బలిపీఠం పై ఆరోగ్యాన్ని బలి ఇస్తున్నది. జల ప్రళయానికి ముందున్న ప్రపంచ ప్రజలు ఆహారపానాల్లో మితం పాటించలేదు. ఆ కాలంలో మాంసాహారాన్ని దేవుడు అనుమతించకపోయినా, వారు మాంసాహారానికి తెగబడ్డారు. తమ వక్ర ఆహార వాంఛకు హద్దులు చెరిగిపోయేవరకు వారు తింటూ తాగుతూ తాగుతూ తింటూ పోయారు. వారి దుష్టత ఎంతగా పెచ్చరిల్లిందంటే దేవుడు వారిని ఇక సహించలేక పోయాడు. వారి అపరాధ పాత్ర నిండింది. నైతిక కల్మషంతో నిండిన లోకాన్ని దేవుడు జల ప్రళయంతో ప్రక్షాళనం చేశాడు. CDTel 145.4