Go to full page →

మాంసాహారం పట్ల ఇశ్రాయేలు వాంఛ CDTel 147

[C.T.B.H.43,44] (1890) C.H.111,112 CDTel 147.2

233. ఇశ్రాయేలీయుల దేవుడు వారిని ఐగుప్తుదేశంనుంచి బయటికి తీసుకు వచ్చినప్పుడు వారికి మాంసాహారాన్ని చాల కాలం నిలుపు చేసి, పరలోకం నుంచి ఆహారాన్ని, రాతినుంచి నీళ్లని ఇచ్చాడు. ఇది వారికి తృప్తినివ్వలేదు. దేవుడిచ్చిన ఆహారాన్ని వారు ద్వేషించారు. తిరిగి ఐగుప్తుకి వెళ్తే బాగుండునని, అక్కడ మాంసం కుండల పక్క కూర్చుని మాంసం తినవచ్చని ఆశించారు. మాంసం తినకుండటం కన్నా, తమకు బానిసత్యం, మరణం సయితం ఇష్టమే అన్నారు. వారికి మాంసం ఇచ్చి దేవుడు వారి కోర్కె చెల్లించాడు. తమ తిండిబోతుతనం ద్వారా ఓ తెగులు పుట్టించి వారిలో అనేకులు మరణించే వరకు వారిని తిననిచ్చాడు. CDTel 147.3