Go to full page →

నేటి ప్రపంచం CDTel 148

ప్రతీ తరంలోను నేరం వ్యాధి పెరుగుతూ వస్తున్నాయి. ఆహారపానాల్లో నిగ్రహం లేకపోటం, తుచ్చ ఆవేశాలకు బానిసలవ్వటం, మనుషుల ఉత్తమ మానసిక శక్తుల్ని ద్దుబార్చుతున్నాయి. బుద్ధి, ఆహారాన్ని నియంత్రించే బదులు అది ఆందోళనకరమైన రీతిగా ఆహారానికి బానిస అవుతున్నది. కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారానికి వాంఛ అధికమై, కడకు ప్రీతిపాత్రమైన వంటకాల్ని సాధ్యమైనంత మేరకు తినటం ఫ్యాషనుగా మారుతుంది. ముఖ్యంగా వినోదానికి జరుపుకునే పార్టీల్లో అడ్డూ అదుపు లేకుండా తినటం జరుగుతన్నది. వాటిలో మాంసం వేపుళ్ళు, పంచదార మీగడతో నిండిన సార్లు, కేకులు, పైలు, ఐస్టు, టీ, కాఫీలతో డిన్నర్లు, ఆలస్యంగా రాత్రి భోజనాలు, వడ్డించటం జరుగుతుంది. అలాంటి ఆహారంతో ప్రజల చర్మం పసుపురంగు ధరించటం, అజీర్తి వల్ల వారు అనేక బాధలకు గురి అవ్వటంలో ఆశ్చర్యమేమీ లేదు. CDTel 148.1

(1864) Sp. Gifts Iv, 131, 132 CDTel 148.2

234. ప్రపంచ ప్రస్తుత దుర్నీతి పరిస్థితి నాకు దర్శనంలో చూపించబడింది. అది భయంకర దృశ్యం. లోకంలోని జనులు సొదొమ గొమొర్రా నివాసుల్లా నాశనం చెయ్యబడకపోటం నాకు ఆశ్చర్యంగా ఉంది. లోకంలోని ప్రస్తుత క్షీణ స్థితికి, నైతిక దుస్థితికి నాకు తగిన కారణం కనిపిస్తున్నది. గుడ్డి దురావేశం బుద్దిని నియంత్రిస్తున్నది. అనేకులు తమ ఉన్నత, ఉదాత్త ఆశయాల్ని శరీర వాంఛలకు బలిచేస్తున్నారు. CDTel 148.3

మొట్టమొదటి గొప్ప పాపం ఆహారపానాల్లో మితం పాటించకపోటం. పురుషులేంటి స్త్రీలేంటి ఆహార వాంఛకు బానిసలవుతున్నారు. వారు పనిని కూడా మితం లేకుండా చేస్తున్నారు. ఆహారం సంపాదించటానికి కఠిన శ్రమ చేస్తున్నారు. ఇప్పటికే పనిచేసి అలసిన శరీర వ్యవస్థకు అది తీవ్రహాని చేస్తుంది. రుచిని తృప్తిపర్చేందుకోసం స్త్రీలు మండుతున్న స్టవ్ ముందు నిలబడి, మసాలాలు వేసి ఎక్కువగా పోపు చేసి, ఆహారం తయారు చెయ్యటంలో చాలా సమయం గడుపుతారు. ఫలితంగా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు. వారికి నైతిక, ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వరు. అతిగా పనిచేసే తల్లి గృహానికి సూర్యరశ్మి వంటి మృదు స్వభావాన్ని వృద్ధిపర్చటం నిర్లక్ష్యం చేస్తాది. నిత్యజీవానికి సంబంధించిన ఆలోచనలు మూలన పడ్డాయి. ఆరోగ్యాన్ని నాశనం చేసి, చిరచిరలాడే స్వభావం పుట్టించి, ఆలోచనాశక్తిని మసకబార్చుతుంది. CDTel 148.4

(1890) C.T.B.H.16 CDTel 149.1

235. మిత రాహిత్యం మనకు అన్నిచోట్ల దర్శనమిస్తుంది. కారుల్లో స్టీమ్ పడవల్లో మనం ఎక్కడకు వెళ్తే అక్కడ అది కనిపిస్తుంది. శోధకుడి పట్టునుంచి ఆత్మల్ని రక్షించటానికి ఏమి చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మానవుల్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోటానికి సాతాను ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటాడు. ఆహారం ద్వారా మానవుడి పై అతడు బలమైన పట్టును సాధిస్తాడు. ఉత్సాహపర్చే ప్రతీ మార్గాన్ని ఉపయోగించటం ద్వారా అతడు ఈ కార్యాన్ని సాధిస్తాడు. అస్వాభావిక ఉత్తేజకాలన్నీ హాని కలిగిస్తాయి. అవి సారాకోసం వాంఛను పుట్టిస్తాయి. వీటిని ఉపయోగించటం వల్ల సంభవించే హాని నుంచి తప్పించటానికి ప్రజల్ని మనమెలా చైతన్యపర్చగలం? ఈ దిశలో చెయ్యగలిగిందంతా మనం చేస్తున్నామా? CDTel 149.2