Go to full page →

జయించటంలో దానియేలు ఆదర్శం CDTel 153

(1890) C.T.B.H.22,23 CDTel 153.6

241. ఆహార వాంఛను తృప్తిపర్చటానికి కలిగే శోధనలకున్న శక్తిని దేవుడు మాత్రమే ఇవ్వగల శక్తితో అధిగమించగలుగుతాం. కాగా ప్రతీ శోధనతోను తప్పించుకునే మార్గం మనకున్నదన్న దేవుని వాగ్దానం ఉన్నది. అయితే ఇంతమంది ఎందుకు జయించలేకపోతున్నారు? వారు దేవునిపై నమ్మకముంచకపోటమే కారణం. తమ క్షేమాభివృద్ధికి ఏర్పాటైన సాధనాల్ని వారు వినియోగించుకోరు. కనుక వక్ర ఆహారవాంఛ తృప్తికి సాకుల్ని దేవుడు లెక్కచెయ్యడు. CDTel 153.7

దానియేలు తన మానవ సామర్థ్యాల్ని విలువగలవిగా గుర్తించాడు. కాని వాటిని నమ్ముకోలేదు. ఆయన శక్తి పై పూర్తిగా ఆధారపడి దీన మనసుతో ఆయన వద్దకు వచ్చే వారందరికీ దేవుడు వాగ్దానం చేసిన శక్తిని దానియేలు నమ్ముకున్నాడు. CDTel 154.1

రాజు తినే భోజనాన్ని తిని రాజు సేవించే పానాన్ని పుచ్చుకుని తనను తాను అపవిత్రపర్చుకో కూడదని దానియేలు తీర్మానించుకున్నాడు. ఎందుకంటే అలాంటి భోజనం శరీర శక్తుల్ని బలపర్చటం గాని మానసిక సామర్థ్యాన్ని వృద్ధిపర్చటం గాని చెయ్యలేదని అతడికి తెలుసు. ద్రాక్షరసాన్ని గాని మరే ఇతర అస్వాభావిక ప్రేరకాన్ని గాని ఉపయోగించకూడదని, మనసుని మసకబార్చే ఏ పదార్థాన్ని ఉపయోగించకూడదని నిర్ధారణ చేసుకున్నాడు. దేవుడు అతడికి “జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు” అనుగ్రహించాడు. “సకల విధములగు దర్శనములను స్వప్న భావములను” అనుగ్రహించాడు... CDTel 154.2

దానియేలు తల్లిదండ్రులు అతడికి తన బాల్యంలో ఆశానిగ్రహపు అలవాట్లు నేర్పించారు. తన అలవాట్లన్నింటిని తాను ప్రకృతి చట్టాలకు అనుగుణంగా దిద్దుకోవాలని; తన ఆహారపానాలు తన శారీరక, మానసిక, నైతిక స్వభావాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని; అవి తనకు దేవుడు వరంగా ఇచ్చినవి గనుక తాను చేసే ఎలాంటి పనులవల్ల వాటిని అణగార్చటం గాని కుంటుపర్చటం గాని చెయ్యకుండా కాపాడుకోవాలని; వాటి నిమిత్తం తాను దేవునికి జవాబుదారి అని వారు అతడికి నేర్పించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ ఉపదేశం ఫలితంగా అతడు దైవ ధర్మ శాస్త్రాన్ని తన మనసులో ఘనపర్చి పరిశుద్ధంగా భావించాడు. తన చెర తొలి సంవత్సరాల్లో రాజు ఆస్థానపు వైభవంతోను, నయవంచన తోను, అన్యమతంతోను పరిచయం ఏర్పర్చుకోటం దానియేలుకి తీవ్రశ్రమ అయ్యింది. స్వస్తబుద్ధి, పరిశ్రమ, విశ్వసనీయతతో నిండిన సేవా జీవితానికి అది ఓ విచిత్రమైన విద్యాకేంద్రం! అయినా తాను దుష్ట వాతావరణం నడి మధ్య ఉన్నప్పటికీ అతడు నీతివంతంగా నివసించాడు. CDTel 154.3

దానియేలు అతడి మిత్రుల అనుభవం మితాహార ఉపకారాల్ని ఉదాహరిస్తూ, ఆత్మను పవిత్రపర్చుకుని సమున్నతం చేసుకోటంలో తనతో సహకరించే వారికి దేవుడు ఏమిచేస్తాడో సూచిస్తున్నది. వారు దేవునికి గౌరవంగాను బబులోను ఆస్థానంలో ప్రకాశమానమైన జ్యోతులుగాను నివసించారు. CDTel 155.1

క్రైస్తవ మితానుభవంపై ప్రశస్త కాంతికిరణాల్ని సమీకరించుకుని ఆరోగ్య చట్టాలికి అనుగుణంగా నివసించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనల్ని వ్యక్తిగతంగా పిలుస్తున్న దేవుని స్వరం ఈ చరిత్రలో మనకు వినిపిస్తున్నది. CDTel 155.2

[R.&H., జనవరి 25, 1881] C.H.66 CDTel 155.3

242. దానియేలు అతడి మిత్రులు పరిస్థితుల ఒత్తిడికి లొంగి ఆ అన్యమత అధికారులతో రాజీపడి బబులోనీయుల ఆచారం ప్రకారం తినటానికి తాగటానికి సమ్మతించి ఉంటే ఏం జరిగేది? ఈ ఒక్క సందర్భం సత్యాన్ని గురించి వారి అభిప్రాయాన్ని బలహీనపర్చి, తప్పుపట్ల వారి ఏహ్యతను నాశనం చేసేది. ఆహార వాంఛ తృప్తి శరీరబలం, మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక శక్తి త్యాగానికి దారి తీసేది. ఒక తప్పటడుగు మరిన్ని తప్పులుకి దారి తీసి చివరికి దేవునితో వారి సంబంధం తెగిపోయి వారు శోధనకు పూర్తిగా లొంగిపోటం జరిగేది. CDTel 155.4

[దానియేలు స్వస్తబుద్ధికి సామాన్యాహారం, ప్రార్థనా జీవితం కారణం-117] CDTel 155.5

[దానియేలును గురించి ఇంకా ఎక్కువ సమాచారం-33,34,117] CDTel 155.6