Go to full page →

చిత్త శక్తి ద్వారా, దేవుని కృప ద్వారా CDTel 170

(1890) C.T.B.H.37 CDTel 170.2

259. తిండి ద్వారా సాతాను మనసును జీవి మొత్తాన్ని నియంత్రిస్తాడు. జీవించి ఉండగలిగే వేలమంది ఆహారవాంఛ తృప్తికి తమ సర్వశక్తుల్ని ధారపోసినందువల్ల, శారీరకంగా మానసికంగా నైతికంగా పతనమై సమాధిపాలవుతున్నారు. సాతాను శోధనల్ని తట్టుకోటానికి, అనుచిత ఆహారం కొంచెం కూడా తినకుండా ఉండటానికి, దేవుని కృపచేత పటిష్టమైన చిత్తశక్తి సహాయం ఆవశ్యకత క్రితం తరాల్లోని మనుషులకన్నా ప్రస్తుత తరంలోని మనుషులికి చాలా ఎక్కువగా ఉన్నది. అప్పుడు నినసించిన ప్రజలకన్నా ప్రస్తుత తరం ప్రజలకు తక్కువ ఆత్మనిగ్రహశక్తి ఉంది. CDTel 170.3

(1881) 4T 574 CDTel 170.4

260. శోధనను ముఖ్యంగా తిండికి కలిగే శోధనను ప్రతిఘటించటానికి, ఆత్మోపేక్ష పాటించటానికి, నైతిక ధైర్యం ప్రదర్శించేవారు బహు కొద్దిమందే. ఇతరులు మూడో పూట తినటం కొందరికి తాళలేని శోధన అవుతుంది. అది ఆహారం కోసం కడుపు ఇచ్చే పిలుపు కాక నియమంచే పటిష్ఠంకాని, ఆత్మత్యాగంచే క్రమశిక్షితం కాని మనసు వ్యక్తం చేసే కోరిక అయినప్పుడు తాము ఆకలిగా ఉన్నట్లు వారు ఊహించుకుంటారు. ఆత్మనిగ్రహం సంయమనం గోడలు ఒకే సందర్భంలో బలహీనమై కూలిపోకూడదు. అన్యజనులకి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను.” CDTel 170.5

చిన్న చిన్న విషయాల్లో జయం సాధించలేని వారికి పెద్ద పెద్ద శోధనల్ని ప్రతిఘటించటానికి నైతిక శక్తి ఉండదు. CDTel 171.1

(1905) M.H.323 CDTel 171.2

261. మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా పరిగణించండి. కార్యం నుంచి కారణాన్ని అధ్యయనం చెయ్యండి. ఆత్మనిగ్రహం నేర్చుకోండి. ఆహారవాంఛను స్వస్తబుద్ధి అదుపులో ఉంచండి. అతిగా తినటం ద్వారా కడుపును దుర్వినియోగపర్చకండి. అయినా ఆరోగ్యానికి అవసరమైన, బలవర్ధకమైన, రుచికరమైన ఆహారాన్ని తినటం మానకండి. CDTel 171.3

(1900) 6T 336 CDTel 171.4

262. అవిశ్వాసులతో మీ సహవాసంలో నియమాలనుంచి తొలగకండి. వారితో భోజనానికి కూర్చుంటే మితంగా భుజించండి. మనసును గలిబిలి పర్చని ఆహారాన్ని భుజించండి. అమితానికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాల్ని గ్రహించలేని స్థితిలో ఉండకుండా ఉండేందుకు మీరు మీ మానసిక శక్తుల్ని లేదా శారీరక శక్తుల్ని బలహీనపర్చుకోకూడదు. తన వాక్యలోని ప్రశస్త సత్యాల్ని దేవుడు మీ మనసు పై ముద్రించటానికి యోగ్యమైన స్థితిలో దాన్ని కాపాడుకోండి. CDTel 171.5