(1890) C.T.B.H.19 CDTel 173.3
265. ఆహారాంశంపై క్రీస్తు పోరాడి విజయం సాధించాడు. ఆయన నుంచి బలం పొంది మనం కూడా జయించవచ్చు. గుమ్మాలగుండా ఆ పట్టణంలోకి ఎవరు ప్రవేశించగలుగుతారు? ఆహారం శక్తిని జయించలేమని చెప్పేవారు కాదు. మనల్ని ఎవరు తన బానిసలుగా చేసుకుంటున్నాడో ఆ సాతాను శక్తిని క్రీస్తు ప్రతిఘటించాడు. నలభై రోజులు ఉపవసించి బలహీనుడైనప్పటికీ ఆయన శోధనను తట్టుకుని, మనం కూడా అతడ్ని ప్రతిఘటించగలమని ఆ కార్యం ద్వారా నిరూపించాడు. మనం ఒంటరిగా విజయం సాధించలేమని నేనెరుగుదును. మనకు సహాయం చెయ్యటానికి సమ్మతంగాను సంసిద్ధంగాను ఉన్న సజీవరక్షకుని నిమిత్తం మనం ఎంతో కృతజ్ఞులం కావాలి. CDTel 173.4
(1905) M.H.176 CDTel 173.5
266. తమ బలహీన, చంచల మానవ మనశ్శక్తిని సర్వశక్తిగల, స్థిరమైన దైవచిత్తంతో సంయుక్తం చెయ్యటానికి సమ్మతంగా ఉండే ప్రతీవారు పవిత్రమైన, సమున్నతమైన జీవితం, ఆహారవాంఛల్ని శరీరేచ్చల్ని జయించే జీవితం జీవించటం సాధ్యమే. CDTel 173.6