Go to full page →

ఆలస్యంగా తినే రాత్రి భోజనం CDTel 175

269. శరీర శ్రమ అవసరం లేని ఆఫీసు పనులు చేసేవారికి రాత్రి ఆలస్యంగా భోజనం చెయ్యటం హానికరం. అది కడుపులో సృష్టించే కల్లోలం వ్యాధితో ఆరంభమై మరణంతో అంతమౌతుంది. CDTel 175.5

దినంలో జీర్ణక్రియ అవయవాలు ఎక్కువ శ్రమపడి పనిచేసినందువల్ల అనేక సందర్భాల్లో ఆహార వాంఛకు దారితీసే అశక్తతా భావం ఏర్పడుతుంది. ఒక భోజనాన్ని పరిష్కరించిన అనంతరం జీర్ణక్రియ అవయవాలకి విశ్రాంతి అవసరం. భోజనానికి భోజనానికి నడుమ కనీసం ఐదు లేక ఆరు గంటల వ్యవధి ఉండాలి. దినానికి మూడు భోజనాలకన్నా రెండు భోజనాల ప్రణాళికను అనుసరించి చూసినవారు మూడు భోజనాలకన్నా రెండే మేలని తెలుసుకుంటారు. CDTel 176.1

(1865) H.& L. అధ్యా. 1,పులు 55,57) CDTel 176.2

270. అనేకమంది నిద్రపోటానికి ముందు భోజనం చేస్తారు. ఇది ప్రమాదకరమైన అలవాటు. వారు మూడుసార్లు భోంచేసి ఉండవచ్చు. కాని తాము శక్తిహీనంగా ఉన్న భావన ఆకలిగా ఉన్న భావన కలగటం మూలాన మూడోసారి అంటే నాల్గోసారి భోంచేస్తారు. ఈ దురభ్యాసాన్ని కొనసాగిస్తారు. అది ఓ అలవాటుగా మారుతుంది. పడుకోకముందు మరోసారి భోజనం చేస్తేనేగాని నిద్రపోలేమంటారు. అనేక సందర్భాల్లో ఈ అశక్తతకు కారణం తరచుగాను పెద్దమొత్తంలోను కడుపులోకి పంపే అనారోగ్యకరమైన ఆహారాన్ని పరిష్కరించటానికి జీర్ణక్రియ అవయవాలు దినమంతా తీవ్ర శ్రమకు గురి అవ్వటమే. ఈ రీతిగా శ్రమపడ్డ జీర్ణక్రియ అవయవాలు అలసిపోతాయి. అలసిపోయిన వాటి శక్తుల పునరుద్ధరణకు కొంత సమయం పని నుంచి పూర్తి విశ్రాంతి అవసరమౌతుంది. ముందుతిన్న భోజనాన్ని జీర్ణించుకోటానికి అవసరమైన శ్రమనుంచి విశ్రమించటానికి కడుపుకి సమయం ఇవ్వకుండా రెండో భోజనం తీసుకోకూడదు. మూడో భోజనం తినటమంటూ జరిగితే అది అతి స్వల్పంగాను నిద్రించటానికి కొన్ని గంటలు ముందుగాను జరగాలి. CDTel 176.3

కాని అనేకుల విషయంలో పాపం, కడుపు అలసిపోయానంటూ మొత్తుకున్నా ఫలితముండదు. మరింత ఆహారం కూరటం జరుగుతుంది. ఇది జీర్ణక్రియ అవయవాలకు పనిని నియమిస్తుంది. మళ్లీ అదేపని నిద్రపోతున్న గంటల్లో జీర్ణక్రియ అవయవాలు నిర్వహిస్తాయి. అలాంటి వ్యక్తుల నిద్ర చెడ్డకలలతో నిండి కలతగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడు వారికి ప్రశాంతత తాజాతనం ఉండవు. చురుకుతనం లేనట్లు, ఆకలి లేనట్లు అనిపిస్తుంది. శరీరమంతా బలం లేనట్లు అనిపిస్తుంది. కొద్ది సమయంలో జీర్ణక్రియ అవయవాలు అలసిపోతాయి. ఎందుకంటే విశ్రాంతి తీసుకోటానికి వాటికి సమయం లేదు. వీరు తీవ్ర అజీర్తి వ్యాధికి గురి అవుతారు. అది ఎందుకు సంబంధించిందా అని తలపట్టుకుంటారు. కారణం దాని ఫలితాన్ని తప్పక ఉత్పత్తి చేస్తుంది. ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగిస్తే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. రక్తం మలినమౌతుంది. చర్మం పసుపు రంగు ధరిస్తుంది. ఒంటి పై చిన్న చిన్న పొక్కులు వస్తాయి. అలాంటి వారు తరచుగా కడుపు భాగంలో నొప్పిగురించి పుండ్లు గురించి ఫిర్యాదు చేస్తారు. పని చేసేటప్పుడు వారి కడుపు అలసిపోతుంది. అందువల్ల వారు పనిమాని విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. ఆ పరిస్థితులకి హేతువు తెలియక వారు తెల్లబోతారు. ఎందుచేతనంటే, దీన్ని విడిచి పెట్టినప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. CDTel 176.4