ఉత్తరం 2, 1872 CDTel 195.1
314. నీవు కొంతకాలం రోజుకి ఒకపూటే భోజనం చేస్తున్నావని నాకు తెలుసు. అయితే నీ విషయంలో ఇది తప్పు అని నాకు తెలుసు. ఎందుకంటే పోషకపదార్థాలున్న ఆహారం నీకు అవసరమని, నీవు అతి మితంగా తినే ప్రమాదంలో ఉన్నావని నేను దర్శనంలో చూశాను. ఈ కఠిన క్రమశిక్షణకు నీకున్న శక్తి చాలదు..... CDTel 195.2
రెండు రోజులు ఉపవాసముండటంలో నీవు తప్పుచేస్తున్నావని నా అభిప్రాయం. నీ నుంచి అది దేవుడు కోరలేదు. జాగ్రత్తగా ఉంటూ రోజుకి రెండు పూటలు ఆరోగ్యకరమైన ఆహారం స్వేఛ్చగా తినవలసిందిగా నిన్ను బతిమాలుతున్నాను. నీ మితాహారవిధానం మార్చుకోకపోతే నీవు శక్తిహీనుడవవ్వటం, నీ మనసు సమతుల్యతను కోల్పోటం తథ్యం. CDTel 195.3