Go to full page →

సంస్కరణను గూర్చి తప్పు అభిప్రాయాలు CDTel 200

(1905) M.H. 318,320 CDTel 200.1

316 ఆహార సంస్కరణ వాదులుగా చెప్పుకునే వారందరూ వాస్తవంలో సంస్కర్తలు కారు. కొందరి విషయంలో అనారోగ్యకరమైన కొన్ని ఆహారపదార్ధాల్ని విసర్జించటానికే సంస్కరణ పరిమిత మౌతుంది. వారు ఆరోగ్యనియమాల్ని స్పష్టంగా అవగాహన చేసుకోరు. వారి భోజనబల్లలు హానికరమైన వంటకాలతో నిండి ఉంటాయి. వారు క్రైస్తవ మితానుభవానికి ఆదర్శం కాజాలరు. CDTel 200.2

ఇంకో తరగతి వారు ఆదర్శనీయులుగా నిలవాలన్న అభిలాషతో దానికి విరుద్ధమైన తీవ్ర వైఖరిని అవలంబిస్తారు. కొంతమందికి తాము వాంఛించే ఆహార పదార్థాలు లభించవు. తమ ఆహారంలోని కొరతను భర్తీ చేసే ఆహార పదార్థాల్ని ఉపయోగించుకునే బదులు వారు నాణ్యతలేని నాసిరకం ఆహారాన్ని తీసుకుంటారు. వారు తినే ఆహారం మంచి రక్తం ఉత్పత్తిచెయ్యటానికి అవసరమైన పదార్థాల్ని సరఫరా చెయ్యదు. వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. వారి ప్రయోజనకారిత్వం నశిస్తుంది. వారి ఆదర్శం ఆహార సంస్కరణను సమర్థించే బదులు దానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. CDTel 200.3

ఆరోగ్యానికి సామాన్యాహారం అవసరం కాబట్టి ఆహారం ఎంపికలోనేగాని తయారీలోనేగాని ఏమంత శ్రద్ధ అవసరం లేదని కొందరు భావిస్తారు. మరి కొందరైతే చాలా మితంగా తినటంతో సరిపెట్టుకుంటారు. శరీర వ్యవస్థకు అవసరమైన ఆయా రకాల పదార్థాల్ని చాలినంతగా ఉపయోగించరు. పర్యవసానంగా వ్యాధి బాధలకు గురి అవుతారు. CDTel 200.4