Go to full page →

ఆహారపదార్థాల్లో మార్పు CDTel 203

(1868) 2T 63 CDTel 203.2

320. మీ జీవన అలవాట్లను మార్చుకోవలసిందిగా మా సలహా. అయితే ఈ మార్పు చేసుకునేటప్పుడు మీరు అవగాహనతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నాం. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు మాంసాహారం నుంచి పోషకపదార్థాలు కొరవడ్డ, బలంలేని ఆహారానికి మారారు. వారు తమ ఆహారాన్ని ఎంత అధ్వానంగా తయారు చేస్తారంటే కడుపు దాన్ని అసహ్యించుకుంటుంది. అలాంటివారు ఆరోగ్య సంస్కరణ తమకు సరిపడలేదని, తాము శారీరక శక్తిని కోల్పోతున్నామని నాతో చెప్పారు. కొందరు తమ ఆహారాన్ని సాధారణంగా తయారు చేసుకోటంలో విఫలులవ్వటానికి ఇక్కడ ఓ కారణం కనిపిస్తుంది. వారి ఆహారం సారం లేనిది. ఆహారాన్ని శ్రద్ధతీసుకుని తయారు చెయ్యరు. ఆహారాన్ని ఎల్లప్పుడూ ఒకేలా తయారు చేస్తారు. ఏ ఒక్క భోజనంలోను అనేక రకాల వంటకాలు తినకూడదు. అయినా అన్ని పూటలా మార్పు లేకుండా ఒకే రకమైన ఆహారం ఉండకూడదు. ఆహారాన్ని అతి సామాన్యంగా సాదాగా తయారు చెయ్యాలి. అయినా ఆకలి పుట్టించే విధంగా దాన్ని చక్కగా తయారు చెయ్యాలి. మీ ఆహారంలో కొవ్వు ఏ రూపంలోనూ ఉండకూడదు. మీరు తయారు చేసే ఏ వంటకాన్నయినా అది భ్రష్టం చేస్తుంది. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి. CDTel 203.3

Y.I. మే 31, 1894 CDTel 204.1

321. ఆరోగ్య సంస్కరణకు అనేకులు వక్ర భాష్యం చెబుతున్నారు. యధార్థ జీవనాన్ని ఏది స్థాపిస్తుంది అన్న దాన్ని గురించి వారికి వక్ర భావాలుంటాయి. సరియైన ఆహారమంటే ప్రధానంగా జావ లేక సంకటి అని కొందరు యధార్థంగా నమ్ముతారు. ప్రధానంగా జావ లేక సంకటి తీసుకోటం జీర్ణమండల అవయవాలకి ఆరోగ్యం చేకూర్చదు. ఎందుకంటే అది చాలా మట్టుకు ద్రవం లాంటిది. CDTel 204.2