Go to full page →

ప్రజలకు వ్యతిరేకంగా తీవ్రత కన్నా వారి పక్షంగా తప్పు చేయటం మేలు CDTel 217

ఉత్తరం 57, 1886 CDTel 217.2

331. సోదరుడు, సోదరీ - తిండి విషయంలో పరిమితి పాటించలేదు. వైద్యసంస్థ నిరాశ చెందింది. శత్రువు ఇప్పుడు మిమ్మల్ని దానికి ప్రతికూలంగా హద్దు మీరేటట్టు నెట్టుతాడు. సాధ్యమైతే మిమ్మల్ని సారంలేని ఆహారానికి నడపుతాడు. సరిగా ఆలోచించండి. సరియైన అభిప్రాయాలు కలిగి ఉండండి. దేవుని వద్దనుంచి వివేకం వేడుకుని అవగాహనతో ముందుకు సాగండి. మీరు అతి తీవ్ర ధోరణిని అవలంబిస్తే వెనకంజ వెయ్యక తప్పదు. అప్పుడు మీరు ఎంత మనస్సాక్షిగా నివసించినా, మీ ఆలోచనా సరళిలో మీకు నమ్మకం పోతుంది. మన సహోదరులు, అవిశ్వాసులకు మీపై నమ్మకం ఉండదు. దేవుని వద్దనుంచి మీకు వచ్చే వెలుగుకి మించి ముందుకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఏ మనుషుడి అభిప్రాయాల్నీ అంగీకరించకండి; దేవుని భయంతో ముందుకి కదలండి. CDTel 217.3

మీరు తప్పుచేస్తే అది ప్రజలకి ఎంత దూరంగా వెళ్లిపోగలరో అంత దూరంగా వెళ్లిపోటంలో కాదు. ఎందుకంటే అప్పుడు మీరు మీ ప్రభావం అనే దారాన్ని తెంచి వేస్తారు. వారికి మీరు ఏ మేలు చెయ్యటానికి ఉండదు. ప్రజల పక్షంగా ఉండటంలో తప్పుచెయ్యటం వారికి దూరంగా వెళ్లిపోటం కన్నా మంచిది. అలా చేసినప్పుడు ప్రజల్ని మీ కూడా ఉంచుకోవచ్చు. కాగా ఏ పక్కా తప్పు చేయాల్సిన అవసరం లేదు. CDTel 218.1

మీరు నీటిలోకి లేక అగ్నిలోకి వెళ్లనవసరం లేదు. కానీ మధ్యేమార్గం తీసుకుని ఆ కొనకుగాని ఈ కొనకు గానీ వెళ్లకుండా చూసుకోండి. మీరు ఏకపక్ష వ్యక్తులుగా సమతుల్యతలేని వ్యక్తులుగా కనిపించకూడదు. చాలని, నిస్సారమైన ఆహారం తీసుకోవద్దు. నాసిరకం ఆహారం తీసుకోటానికి ఎవరూ మిమ్మల్ని ప్రభావితం చెయ్యనివ్వకండి. మీ ఆహారాన్ని ఆరోగ్యంగా రుచికరంగా తయారు చెయ్యించుకోండి. ఆరోగ్య సంస్కరణను సరిగా సూచించేరీతిగా మీ ఆహారాన్ని తయారుచెయ్యించుకోండి. CDTel 218.2

ఆరోగ్య సంస్కరణ విషయంలో తిరోగమనానికి కారణం దాన్ని వివేకం లేని మనుషులు చేపట్టి అతిగా అమలు పర్చటం; మనసులు మార్చే బదులు అది మనుషుల్ని విసిగించటం. ఈ తీవ్ర భావజాలం అమలైన స్థలాలకి నేను వెళ్లాను. కూరగాయల్ని నీళ్లతోనే సిద్ధంచేశారు. తక్కిన ఇతర విషయాలన్నీ ఇలాగే ఉన్నాయి. ఈ రకమైన వంట ఆరోగ్యవైకల్యం. కొన్ని మనసులు ఆహారపరంగా ఎలాంటి కాఠిన్యాన్నయినా లేక సంస్కరణనైనా అంగీకరించేటట్లు నిర్మితమయ్యాయి. CDTel 218.3

నా సహోదరులారా, మీరు అన్ని విషయాల్లోను మితంగా ఉండాలని కోరుతున్నాను. కాని ఆ విషయాన్ని ఎక్కువ సాగనీయకుండా లేదా మన సంస్థల్ని సంకుచిత మార్గాల్లో నడిపించి దుస్థితికి తేకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతీ అభిప్రాయాన్ని అంగీకరించకుండా స్వస్తబుద్ధి ప్రశాంతత కలిగి దేవుని పై విశ్వాసముంచాలి. CDTel 218.4