(1865) H.టు L., అధ్యా.2, పులు.33,34 CDTel 227.1
337. అనేక సందర్భాల్లో ప్రసవానికి ముందు ప్రొద్దున్నే, చీకటి పడ్డప్పుడు తల్లి కష్టపడి పనిచెయ్యటానికి, తద్వారా తన రక్తాన్ని వేడి చేసుకోటానికి అనుమతించటం జరుగుతుంది.... ఆమె శక్తిని మనసులో ఉంచుకోటం జరగాలి. ఆమె భారాలు, చింతలు తగ్గించటానికి ప్రయత్నం జరగదు. అందరికన్నా ముఖ్యంగా ఆమెకు విశ్రాంతి సమయం కావలసిన సమయం ఆమె అలసిపోయి, విచారంగా ఉండే సమయం అవుతుంది. ఆమె ఎక్కువ శ్రమ పడటం ద్వారా తన సంతానానికి ప్రకృతి ఏర్పాటు చేసిన పౌష్ఠికత లేకుండా చేస్తుంది. తన రక్తాన్ని వేడి చేసుకోటం ద్వారా ఆమె తన బిడ్డకు నాసిరకం రక్తాన్ని ఇస్తుంది. ఆమె సంతానం జీవశక్తి, శారీరక శక్తి, మానసిక శక్తి దోచుకోబడతాయి. CDTel 227.2
338. తన కుటుంబంలో బి నడత నాకు దర్శనంలో చూపించబడింది. అతడు కఠినంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడు. సహోదరుడే ప్రబోధించే ఆరోగ్య సంస్కరణను అతడు అవలంబించి అతడిలా తీవ్రధోరణిని అవలంచించాడు. దాని ఫలితాన్ని కాలం తుడిచివేయలేదు. పుస్తకాల్లోనుంచి సంగ్రహించిన అంశాల సహాయంతో, సహోదరుడు సి ప్రబోధించే సిద్ధాంతాన్ని అతడు ఆచరించటం మొదలు పెట్టాడు. అతడిలా అందరినీ తన ప్రమాణానికి తీసుకురావటానికి తీర్మానించుకున్నాడు. తన సొంత కుటుంబాన్ని తన కఠిన నిబంధనల్ని అనుసరించేట్టు చేశాడు. కాని తన పాశవిక ప్రవృత్తుల్ని అదుపుచెయ్యటంలో విఫలుడయ్యాడు. ఆరోగ్య సంస్కరణని గూర్చి సరియైన జ్ఞానం అతడికి ఉండి ఉంటే, తన భార్య ఆరోగ్యవంతులైన పిల్లల్ని కనగల ఆరోగ్యస్థితిలో లేదని గ్రహించేవాడు. అదుపులో లేని అతడి ఆవేశం కార్యాకారణ పరిగణన లేకుండా కొనసాగింది. . CDTel 227.3
అతడు తన పిల్లల జననానికి ముందు తన భార్యను మంచి ఆరోగ్యస్థితిలో లేని స్త్రీని చూడాల్సిన రీతిగా చూడలేదు.... ఒక ప్రాణానికి బదులు రెండు ప్రాణాలికి పోషణనివ్వటానికి అవసరమైన పరిమాణంలో నాణ్యత గల ఆహారాన్ని సరఫరా చెయ్యలేదు. ఆమె మీద ఇంకో ప్రాణం ఆధారపడి ఉన్నది. ఆమెకు బలం చేకూర్చటానికి ఆమె శరీర వ్యవస్థకు పౌష్టికమైన, ఆరోగ్యకరమైన ఆహారం సరఫరా అవ్వలేదు. ఆహారం రాశిలోను వాసిలోను కొరవడింది. ఆమె శరీర వ్యవస్థకు మార్పులు, రకరకాల నాణ్యత మరింత పౌష్టకత గల ఆహారం అవసరం. ఆమె బిడ్డలు బలహీన జీర్ణశక్తితో నాసిరకం రక్తంతో జన్మించారు. తనకు సరఫరా చెయ్యబడ్డ ఆహారం నుంచి ఆమె నాణ్యతగల రక్తాన్ని ఇవ్వలేక పోయింది. కనుక ఆమె ఎన్నో ఆరోగ్య సమస్యలలో నిండిన పిల్లలకు జన్మనిచ్చింది. CDTel 227.4