Go to full page →

సంస్కరణ యధార్థ ప్రారంభం CDTel 231

మనదేశంలోనుంచి అమితానుభవ శాపాన్ని బహిష్కరించటానికి మితానుభవ కార్యకర్తల కృషి బలంగా లేదు. ఒకసాం ఏర్పడ్డ అలవాట్లును విడిచి పెట్టటం కష్టం. సంస్కరణ బిడ్డ పుట్టుకకు ముందు తల్లితో ప్రారంభమవ్వాలి. దేవుని ఉపదేశాన్ని పూర్తిగా ఆచరిస్తే అమితానుభవం ఉండదు. CDTel 231.1

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని జీవితాన్ని నాశనం చేసే పాపాలు దుర్మార్గాలనుంచి తన బిడ్డల్ని కాపాడుకోటానికి దేవునితో కలిసి పనిచేసేందుకు ప్రతీ తల్లి తన అలవాట్లను దేవుని చిత్తానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోటానికి నిత్యం కృషి చెయ్యాలి. విచ్ఛిన్నకర శక్తుల నుంచి, అమితానుభవం నుంచి తమ బిడ్డల రక్షణకు దైవకృప సహాయంతో వారి చుట్టూ రక్షణ దుర్గాన్ని నిర్మించటానికిగాను తల్లులు తమ సృష్టికర్తతో సరియైన సంబంధం ఏర్పర్చుకోటానికి జాప్యం లేకుండా పూనుకోవాలి. తల్లులు ఈ మార్గాన్ని అనుసరిస్తే తమ బిడ్డలు, యువకుడైన దానియేలులా, నైతిక, మానసిక సాధనల్లో ఉన్నత ప్రమాణాన్ని సాధించి, సమాజానికి దీవెనగా తమ సృష్టికర్తకు మహిమకరంగా నివసిస్తారు. CDTel 231.2