Go to full page →

సామాన్యతను అధ్యయనం చెయ్యండి CDTel 238

(1890) C.T.B.H.141 CDTel 238.2

349. ఆహారం సామాన్యంగా ఉండాలి. ఆహారం తయారు చెయ్యటానికి తల్లి తన సమయాన్నంతటిని వినియోగించ కూడదు. ఆరోగ్యవంతంగా, ఆశపుట్టించే రీతిగా తయారు చేసిన ఆరోగ్యదాయకమైన ఆహారంతో భోజనబల్లని నింపటంలో శ్రద్ధ తీసుకోవాలన్నది వాస్తవం. అజాగ్రత్తగా తయారుచేసిందేదైనా పిల్లలకి ఆహారంగా వడ్డించటానికి సరిపోతుందని తలంచకండి. వక్ర రుచుల్ని తృప్తిపర్చటానికి ఆహారం తయారు చెయ్యటంలో తక్కువ సమయం, పిల్లలకి విద్యను శిక్షణను ఇవ్వటంలో ఎక్కువ సమయం గడపాలి. ఏమి తినాలి, ఏ బట్టలు ధరించాలి అన్న వాటికి ప్రణాళిక వేసుకోటంలో మిరు ధారపోసుతన్న శక్తిని మీ దేహాన్ని బట్టల్ని శుభ్రంగా ఉంచుకోటానికి ఉపయోగించండి. CDTel 238.3

ఉత్తరం 72, 1896 CDTel 239.1

350. వేపుడు చేసిన మాంసపదార్థాలు, వాటివెంట క్రీముతో నిండిన పేస్త్రీలు పిల్లల జీర్ణమండల ప్రధాన అవయవాల్ని క్షీణింపజేస్తున్నాయి. సామాన్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారానికి అలవాటు పడి ఉంటే, వారు అనవసరమైన, కలగలిపి చేసిన విలాస వంటకాల్ని వాంఛించరు... పిల్లలకి మాంసం పెట్టటం విజయానికి ఉత్తమ మార్గం కాదు.... మీ పిల్లలకి మాంసాహారం అలవాటు చెయ్యటం వారికి హానికరం. అస్వాభావిక ఆహారవాంఛని సృష్టించటం సులభం. అది రెండో స్వభావమైనప్పుడు దాన్ని సరిదిద్దటం, సంస్కరించటం కష్టం. CDTel 239.2