Go to full page →

ఉత్తేజకాల పట్ల ఏహ్యత కలిగించండి CDTel 241

(1890) C.T.B.H.17 CDTel 241.3

355. మీ పిల్లలకి ఉత్తేజకాల పట్ల ద్వేషం పుట్టించండి. అజ్ఞానంగా ఎంతమంది వీటిపట్ల రుచిని అభిరుచిని పుట్టిస్తున్నారు! యూరప్ లో నర్సులు చిన్నపిల్లల పెదాలకి వై లేక బీరు గ్లాసులు అందించి తద్వారా వారికి ఉత్తేజకాలపట్ల రుచిని పుట్టించటానికి ప్రయత్నించటం చూశాను. ఆ పిల్లలు పెద్దవారయ్యేకొద్దీ వీటి మీద క్రమ క్రమంగా ఆధారపడటం నేర్చుకుని క్రమక్రమంగా వాటికి లొంగి చివరికి ఎలాంటి సహాయం చెయ్యటానికి వీలులేని పరిస్థితికి చేరుకుని, తాగుబోతులుగా కాటికి వెళ్తారు. CDTel 241.4

అయితే ఆహారాన్ని వక్రీకరించి దాన్ని ఒక ఉచ్చుగా తయారు చేసే మార్గం ఇదొక్కటే కాదు. తరచు ఉత్తేజం పుట్టించే పానీయాలకి కోరిక పుట్టించే రీతిగా ఆహారాన్ని తయారు చేయటం జరుగుతుంది. పిల్లల ముందు విలాసవంతమైన వంటకాల్ని ప్రత్యేక వంటకాలు, — పోపు పొట్టిన పులుసులు, కేకులు, పేస్త్రీలు - పెడతారు. ఎక్కువగా పోపు పెట్టిన ఆహారం కడుపులో మంట పుట్టించి, మరింత బలమైన ఉత్తేజకాలకు వాంఛ పుట్టిస్తుంది. అనుచితమైన ఆహారంతో శోధించగా వారు విచ్చలవిడిగా తినటానికేగాక, మధ్యమధ్య చిరుతిళ్లు తినటానికి కూడా వారిని అనుమతించటం జరుగుతుంది. పన్నెండేళ్లు లేక పధ్నాలుగేళ్ల వయసుకి వచ్చేసరికి వారు అజీర్తి రోగులవుతారు. CDTel 242.1

మద్యపాన వ్యసనానికి దాసుడైన వ్యక్తి కడుపు చిత్రాన్ని మీరు చూసి ఉండవచ్చు. అలాంటి పరిస్థితే మసాలా కారం ప్రభావం వల్ల ఏర్పడుతుంది. కడుపు అలాంటి స్థితిలో ఉండటంతో ఆహారవాంఛను తీర్చటానికి మరింత బలమైనది కావలసివస్తుంది. తర్వాత మీ కుమారులు పొగతాగటం నేర్చుకుంటూ వీధిలో కనిపిస్తారు. CDTel 242.2