Go to full page →

నైతికాభివృద్ధితో ఆహారం సంబంధం CDTel 250

(1890) C.T.B.H.134 CDTel 250.3

362. ఈ యుగంలో యువతపై సాతానుకున్న శక్తి భయంకరమైనది. మన బిడ్డల మనసులు మత నియమాల వలన సమతుల్యమైతే తప్ప. తమకు ఎదురయ్యే దుర్మార్గ సాదృశ్యాల ద్వారా వారి నైతికత భ్రష్టమౌతుంది. యువత ఎదుర్కునే అతి పెద్ద ప్రమాదం ఆత్మ సంయమనం లేకపోటం. పిల్లల్సి గారాబం చేసే తల్లిదండ్రులు వారికి ఆత్మత్యాగం నేర్పించరు. వారు పిల్లల ముందు పెట్టే ఆహారం కడుపులో మంట పుట్టిస్తుంది. ఈ రకంగా ఉత్పత్తి అయిన ఉద్రేకం మెదడుకి అందుతుంది. ఫలితంగా ఆవేశాలు ఉద్రేకాలు మేల్కొంటాయి. మనం తినే తిండి శరీరాన్నే కాదు మనసును కూడా ప్రభావితం చేస్తుందని పదే పదే చెప్పనవసరం లేదు. పుష్టినిచ్చే, ఉత్తేజపర్చే ఆహారం రక్తాన్ని వేడెక్కించి, నాడీ వ్యవస్థని ఉద్రేకపర్చి, తరచుగా నైతిక అవగాహనను మొద్దుబార్చుతుంది. శరీరాశలు ఉద్వేగాలు స్వస్తబుద్దిని, అంతరాత్మను అణచివేస్తాయి. ఆహారపానాల్లో నిగ్రహం పాటించని వ్యక్తి ఓర్పు, ఆత్మసంయమనం ప్రదర్శించటం కష్టమౌతుంది. దాదాపు అసాధ్యమౌతుంది. కనుక ఇంకా ప్రవర్తనలు ఏర్పడని పిల్లలకి ఆరోగ్యదాయకమైన, ఉద్రేకపర్చని ఆహారం అలవర్చటం ప్రత్యేకమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఆహార పానాల్ని మితంలేకుండా తీసుకోటం వల్ల సంభవించే కీడుల నుంచి కాపాడేందుకు మన పరలోకపు తండ్రి ప్రేమతో మనకు ఆరోగ్యసంస్కరణపై వెలుగును పంపించాడు. CDTel 250.4

“కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమసమును దేవుని మహిమ కొరకు చేయుడి.” ఆహారాన్ని తయారుచేసి భోజనం బల్లమీద పెట్టి తినటానికి కుటుంబాన్ని పిలిచేటప్పుడు తల్లిదండ్రులు ఈ పనిచేస్తున్నారా? మంచి రక్తం తయారుచేస్తుందని తమకు తెలిసిన ఆహారాన్నే, వారి దేహ వ్యవస్థని తక్కువ జ్వర స్థితిలో ఉంచి దాన్ని జీవితానికి ఆరోగ్యానికి ఉత్తమ సంబంధంలో ఉంచే ఆహారాన్నే, వారు తమ పిల్లల ముందు పెడుతున్నారా? లేదా వారి శ్రేయస్సుని బేఖాతరు చేసి, అనారోగ్యదాయకమైన, ఉత్తేజం పుట్టించే, మంట కలిగించే ఆహారం వారికిస్తున్నారా? CDTel 251.1

(1870) 2T 365 CDTel 251.2

363. ఆహారం వాసి విషయంలో ఆరోగ్య సంస్కర్తలు సయితం తప్పు చెయ్యవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని వారు అతిగా తినవచ్చు. ఈ కుటుంబంలోని కొందరు నాణ్యత విషయంలో తప్పు చేస్తారు. వారు ఆరోగ్య సంస్కరణ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం చేసుకోరు. తాము కోరుకున్నది ఎప్పుడు అనుకుంటే అప్పుడు తింటారు తాగుతారు. వారు ఈ రకంగా తమ శరీర వ్యవస్థకు హాని చేసుకుంటున్నారు. అంతేకాదు వారు తమ భోజన బల్లల మీద వేడి పుట్టించే ఆహారం, తమ బిడ్డల్లో పాశవిక ఆవేశాల్ని రేపి వారిని ఆధ్యాత్మిక విషయాల్ని అలక్ష్యం చెయ్యటానికి నడిపించే ఆహారం పెట్టటం ద్వారా తమ కుటుంబాలకి హాని చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇలా తమ బిడ్డల్లో పాశవికతను బలపర్చి, ఆధ్యాత్మికతను క్షీణింపజేస్తున్నారు. చివరికి కలిగే శిక్ష ఎంత పెద్దది! తమ బిడ్డలు నైతికంగా బలహీనంగా ఎందుకు ఉన్నారా అని ఆలోచించుకుంటూ ఉంటారు! CDTel 251.3

(1870) 2T 365 CDTel 251.4

364. మనం నివసిస్తున్నది భ్రష్ట యుగం. దేవునికి పూర్తిగా సమర్పితం కాని మనసుల పై సాతానుకి దాదాపు పరిపూర్ణ నియంత్రణ ఉన్నట్లు కనిపించే కాలం. కనుక పెంచాల్సిన పిల్లలున్న తల్లిదండ్రులు పోషకులపై గొప్ప బాధ్యత ఉంది. ఈ పిల్లలికి జన్మనిచ్చే బాధ్యతను తల్లిదండ్రులు వహించారు. ఇప్పుడు వారి విధి ఏమిటి? వారిని తమ ఇష్టం వచ్చినట్లు పెరగనివ్వటమేనా? ఈ తల్లి దండ్రుల మీద భారమైన బాధ్యత ఉన్నదని చెప్పుతాను.... CDTel 251.5

మీలో కొందరు స్వార్థపరులు అంటాను. నా ఉద్దేశమేంటో మీరు గ్రహించటం లేదు. ఏ ఆహారం ఎక్కువ రుచిగా ఉంటుందో మీకు తెలుసు. దేవుని మహిమ కన్నా, దైవిక జీవితంలో వృద్ధి పొందాలన్న ఆకాంక్ష కన్నా, దైవ భీతితో పరిశుద్ధత సంపూర్ణం చేసుకోటం కన్నా, రుచీ, వినోదం ప్రాధాన్యం వహిస్తున్నాయి. మీరు మీ వినోదాల్ని ఆహార వాంఛల్నే పరిగణిస్తున్నారు. మీరీ పనిచేస్తున్న కాలంలో సాతాను మీ కన్నా ముందుంటున్నాడు. మీ ప్రయత్నాల్ని ప్రతీసారి వమ్ము చేస్తున్నాడు. ఈ CDTel 252.1

తండ్రులైన మీలో కొందరు మీ బిడ్డల సమస్య ఏంటో తెలుసుకోటానికి వారిని వైద్యుల వద్దకి తీసుకు వెళ్తారు. సమస్య ఏంటో మీకు నేను రెండు నిమిషాల్లో చెప్పేదాన్ని. మీ పిల్లలు దుష్టులు. వారు సాతాను ఆధీనంలో ఉన్నారు. వారికి దేవుడులా ఉండి కాపాడవలసిన మీరు సుఖంవల్ల మత్తులై నిద్రిస్తున్నప్పుడు మిమ్మల్ని దాటి అతడు లోపలికి వస్తాడు. వారిని ప్రభువు భయంలోను ఆయన వాక్యపోషణతోను పెంచాల్సిందిగా ఆయన మీకు ఆజ్ఞాపించాడు. కాని మీ ముందునుంచే సాతాను వచ్చి వారిని తన బలమైన హస్తాలలో బంధిస్తున్నాడు. అయినా మీరు మత్తు నిద్రలో మునిగి ఉన్నారు. దేవుడు మీమీద మీ బిడ్డల మీద కనికరం చూపించును గాక! మీలో ప్రతీ ఒక్కరికీ ఆయన దయ అవసరం. CDTel 252.2