Go to full page →

శోధనను ఎలా ఎదుర్కోవాలో పిల్లలకి నేర్పించండి CDTel 253

[C.T.B.H.63,64] (1890) F.E.152,153 CDTel 253.3

365. ఆహార వాంఛపై నిఘా ఉంచండి. సామాన్యాహారం తినటం మీ పిల్లలకి ఉచ్చరణ ఆచరణల ద్వారా నేర్పించండి. వారికి కేవలం పని కల్పించటమే కాదు వారిని ప్రయోజనకరమైన పనిలో పరిశ్రమించేటట్లు చేయండి. వారి నైతిక స్పృహను మేలుకొల్పటానికి ప్రయత్నించండి. తమ పసితనం నుంచి సైతం తమ పై దేవునికి హక్కులున్నాయని వారికి నేర్పించండి. అన్ని పక్కలా నైతిక దుర్నీతి తమకు ఎదురవుతుందని, తాము యేసువద్దకు వచ్చి ఆయనకి తమ శరీరాత్మల్ని సమర్పించుకోటం అవసరమని, ప్రతీ శోధనను ప్రతిఘటించటానికి ఆయన తమకు శక్తినిస్తాడని వారికి బోధించండి. స్వీయ ఆత్మల్ని తృప్తిపర్చుకోటానికి తాము సృష్టికాలేదని, ఉన్నతమైన ఉద్దేశాలు సాధించటానికి తాము ప్రభువు ప్రతినిధులమన్న బోధన వారి ముందుంచండి. స్వార్థాశలు తీర్చుకోడానికి శోధనలు కలిగినప్పుడు దేవున్ని తమ మనసుల్లోంచి • తీసివేయటానికి సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు యేసు వంక చూస్తూ నేను ఓడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా! అని వేడుకోటం వారికి నేర్పించండి. CDTel 253.4

తమ ప్రార్థనకు జవాబుగా దూతలు తమ చుట్టూ చేరి తమను సురక్షిత మార్గాల్లో నడిపిస్తారని వారికి నేర్పించండి. - CDTel 254.1

తన శిష్యుల్ని లోకంలోనుంచి తీసుకుపొమ్మంటూ క్రీస్తు ప్రార్థించలేదు గాని వారిని దుష్టినుంచి కాపాడమంటూ, వారు అన్ని పక్కల ఎదుర్కునే శోధనలకు లొంగకుండా వారిని కాపాడమంటూ ప్రార్థించాడు. ఈ ఘన ప్రతీ తండ్రి, ప్రతీ తల్లి చేయాలి. అయితే వారు తమ బిడ్డల పక్షంగా దేవునితో ఇలా విజ్ఞాపన చేసి, తర్వాత వారిని తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటానికి విడిచి పెట్టాలా? ఆహార వాంఛ వారిని శాసించే వరకు తిండి విషయంలో వారిని తలకెక్కించుకుని వారు తమ బిడ్డల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోగలరా? అది జరగదు. ఉయ్యాలలో ఉండే పసివయసు నుంచే ఆత్మ నిగ్రహం, ఆత్మ సంయమనం పిల్లలకి నేర్పించాలి. ఈ పని బాధ్యతను ఎక్కువ భాగం తల్లి నిర్వహించాలి. ఈ లోకంలో మిక్కిలి సున్నితమైన అనుబంధం. తల్లి బిడ్డల మధ్య ఉండేదే బలమైన, సున్నితమైన ఈ సంయోగం కారణంగా తల్లి జీవితం తండ్రి జీవితం కన్నా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. తల్లి బాధ్యత బరువైనది. ఆమెకు తండ్రి చేయూత నిత్యం అవసరమౌతుంది. CDTel 254.2

C.T.B.H.79,80] (1890) F.E.143 CDTel 254.3

366. తల్లులారా! దేవుడు మీకిచ్చిన ప్రశస్త ఘడియల్ని మీ బిడ్డల ప్రవర్తనల్ని నిర్మించటానికి ఆహారపానాల్లో ఆశనిగ్రహ నియమాల్ని ఖచ్చితంగా అనుసరించటం వారికి నేర్పించటానికి వినియోగించటం మీకు ఎంతో మేలు చేస్తుంది.... CDTel 254.4

ఆహార వాంఛను తృప్తి పరచినప్పటికన్నా దాన్ని నియంత్రించినప్పుడు మనుషుల మనసుల పై తనకు ఎక్కువ శక్తి ఉండదని సాతాను చూస్తాడు. కనుక తిండి తిని తాగటానికి అతడు మనుషుల్ని నిత్యం నడిపిస్తాడు. హానికరమైన ఆహారం ప్రభావం కింద మనసాక్షి మొద్దుబారి, మనసు చీకటితో నిండటంవల్ల అది సదభిప్రాయాలికి సుముఖంగా ఉండదు. కాగా మనస్సాక్షి మొద్దుబారేవరకూ ఉల్లంఘన సాగుతుంది. కనుక అపరాధి నేరం తగ్గదు. CDTel 255.1

(1909) 9T 160,161 CDTel 255.2

367. తండ్రులారా, తల్లులారా మెలకువగా ఉండి ప్రార్థించండి. ప్రతీ రూపంలోను మితానుభవం విషయంలోను జాగ్రత్తగా ఉండండి. మీ బిడ్డలకి యధార్ధమైన ఆరోగ్యసంస్కరణ నియమాల్ని నేర్పించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి మీరేమితినటం తాగటం చెయ్యకూడదో వారికి నేర్పించండి. అవిధేయులైన పిల్లల పై దేవుని కోపం ఇప్పటికే రగులుతున్నది. ప్రతీ చోట ఎలాంటి నేరాలు ఎలాంటి పాపాలు ఎలాంటి దురాచారాలు వెలుగులోకి వస్తున్నాయి! ఓ జననాంగంగా మనం మన బిడ్డల్ని భ్రష్ట స్నేహితులనుంచి కాపాడుకోటంలో శ్రద్ధ వహించాలి. CDTel 255.3

[గ్రామప్రాంతాల్లోని గృహం : ఆహారానికి నైతికతకు మద్య సంబంధం-711] CDTel 255.4