Go to full page →

వంటగత్తెకి గౌరవం CDTel 258

(1870) 2T 370 CDTel 258.1

369. నా కుట్టుపని చేసే స్త్రీని ఎంతో విలువైన వ్యక్తిగా భావిస్తాను. నాకు నకళ్లు తీసే వ్యక్తిని విలువైన వాడిగా పరిగణిస్తాను. కాని ప్రాణానికి పోషణను, మెదడు, ఎముక, కండరానికి పౌష్టికతను సమకూర్చే ఆహారాన్ని తయారు చేసే వంటకత్తె మా గృహంలోని సహాయకులందరిలోను అతి ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. CDTel 258.2

370. బట్టలు కుట్టే పని, టైపు చేసే పని, ప్రూఫ్ చదివేపని, పులు రాసే పని చేసేవారు లేక ఉపాధ్యాయ వృత్తి నేర్చుకున్న కొందరు తమని తాము సంపన్నులుగా ఊహించుకుని వంట పనివారితో కలవరు. వారిని చిన్నచూపు చూస్తారు. CDTel 258.3

ఈ అభిప్రాయాలు సమాజంలోని దాదాపు అన్ని తరగతుల ప్రజల్లోనూ ఉన్నాయి. సాంఘిక జీవిత సరళిలో వంటగమనిషి స్థానం. తక్కువదని తాను పనిచేసే కుటుంబ సభ్యులతో సమానమైన వ్యక్తిగా మెలగకూడదని ఆమె భావించేటట్లు చెయ్యటం జరుగుతున్నది. తెలివి తేటలు గల ఆడపిల్లలు ఇతర, వృత్తులు నేర్చుకోటానికి తెగబడటంలో ఆశ్చర్యం ఉందా? చదువుకున్న వంటపనివారు బహు కొద్దిమందే ఉండటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? అసలు ఆశ్యర్యం ఏంటంటే అలాంటి చిన్న చూపును సహించేవారు అంతమంది ఉండటం. CDTel 258.4

కుటుంబంలో వంటమనిషి ప్రాముఖ్యమైన స్థానం ఆక్రమిస్తుంది. మెదడు, ఎముక, కండరం నిర్మించేందుకు కడుపులోకి తీసుకునే ఆహారాన్ని ఆమె తయారు చేస్తుంది. కుటుంబసభ్యుల ఆరోగ్యం చాలామట్టుకు ఆమె నిపుణత, ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. గృహ విధులు నమ్మకంగా నిర్వర్తించే వారు ఉచిత గౌరవ మర్యాదలు పొందేవరకు వాటి కున్న ప్రాధాన్యాన్ని అవి పొందలేవు. CDTel 258.5

371. పెళ్లిళ్లు అయ్యి కుటుంబాలున్నా. భార్యగా, తల్లిగా తమ పై పడే విధుల్ని గూర్చిన వ్యావహారిక జ్ఞానం లేని యువతులు చాలా మంది ఉన్నారు. వారు చదవగలరు, సంగీత వాద్యం వాయించగలరు. కాని వంట చెయ్యలేరు. కుటుంబ ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్రెడ్డు తయారు చెయ్యలేరు..... బాగా వంటచెయ్యటానికి, భోజన బల్లమీద ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఆకర్షణీయమైన విధంగా ఏర్పాటు చెయ్యటానికి తెలివి అనుభవం అవసరం. రక్తంగా మారి మన శరీర వ్యవస్థకు పోషణనిచ్చేందుకు మనం తిని కడుపులోకి పంపే ఆహారాన్ని తయారుచేసే వ్యక్తి అతి ముఖ్యమైన, అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నకళ్లు తీసే వ్యక్తి, బట్టలు కుట్టే వ్యక్తి, లేక సంగీతం నేర్పే వ్యక్తి స్థానం వంటమనిషి స్థానమంత ప్రాముఖ్యంగలది కాదు. CDTel 258.6