Go to full page →

పురుషులు, స్త్రీలు వంట నేర్చుకోవాలి CDTel 260

[C.T.B.H.56,57] (1890) C.H.155 CDTel 260.1

374. ఆరోగ్యసంస్కరణను అనుసరించే వారిలో చాలా మంది అది తమకు పడటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. కాని వారితో కలిసి భోజనబల్ల వద్ద కూర్చున్నప్పుడు, సమస్య ఆరోగ్య సంస్కరణతో కాదుగాని సరిగా తయారు చెయ్యని ఆహారంతోనని తేలింది. దేవుడు వివేకాన్నిచ్చిన పురుషులకి స్త్రీలకి నా విజ్ఞప్తి: వంటచెయ్యటం నేర్చుకోవలసింది అని. “పురుషులు” అనటంలో నేను పొరపాటు చెయ్యటం లేదు. ఎందుకంటే వారూ స్త్రీలు సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చెయ్యటం నేర్చుకోటం అవసరం. తరచు తమ వ్యాపారం వారిని ఆరోగ్యకరమైన ఆహారం దొరకని స్థలాలకి తీసుకు వెళ్లవచ్చు. కొన్ని దినాలు, వారాలు సయితం ఆహారం తయారుచెయ్యటం విషయంలో అజ్ఞానులైన కుటుంబాలతో ఉండాల్సి రావచ్చు. వారికి వంట జ్ఞానం ఉంటే, అప్పుడు దాన్ని మేలుకరంగా ఉపయోగించుకోవచ్చు. CDTel 260.2