Go to full page →

పొదుపు నేర్చుకోండి CDTel 265

MS 3, 1897 CDTel 265.4

386. ప్రతీ రకమైన వంటలోను పరిగణించవలసిన విషయం “ఆహారాన్ని మిక్కిలి సహజంగా, పొదుపుగా తయారు చెయ్యటం ఎలా?” అన్నది. భోజనమైన తర్వాత మిగిలిన ఆహారాన్ని వ్యర్థం చెయ్యకుండేందుకు జాగరూకతతో కూడిన అధ్యయనం జరగాలి. మిగిలిన ఆహార శకలాలు వ్యర్ధం కాకుండే మార్గాల్ని అధ్యయనం చెయ్యండి. ఈ నిపుణత, పొదుపు, నేర్పు ఓ అదృష్టం. రుతువులో ఎక్కువ వేడిగా ఉన్న భాగాల్లో తక్కువ ఆహారం తయారుచెయ్యండి. ఎండబెట్టిన పదార్థాలు ఎక్కువగా వాడండి. తినటానికి చాలినంత లేకపోయిన తాము ఎందుకు పేదలుగా ఉన్నారో గ్రహించే పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంచెం కొంచెం మిగిలిన ఆహార పదార్థాల్ని వ్యర్ధం చెయ్యటం చాలా జరుగుతున్నది. CDTel 265.5