Go to full page →

వంటమర్మాలు నేర్పండి CDTel 273

(1870) 2T 537,538 CDTel 273.4

395. మీ బిడ్డలకి వంట చెయ్యటం నేర్పటం అశ్రద్ధ చెయ్యకండి. అలా చెయ్యటంలో వారికి మత విద్యలో ఉండాల్సిన నియమాల్ని మీరు నేర్పుతున్నారు. మీ బిడ్డలకి శరీర ధర్మశాస్త్రంలో పాఠాలు చెప్పటంలోను, సామాన్యంగా, నిపుణతతో ఎలా వండాలో నేర్పటంలోనూ, మీరు విద్యలో మిక్కిలి ప్రాముఖ్యమైన శాఖకు పునాది వేస్తున్నారు. మంచి బ్రెడ్డు తయారు చెయ్యటానికి నిపుణత అవసరం. బాగా వంటచెయ్యటంలో మతం ఉన్నది. వంటచెయ్యటం నేర్చుకోటంలో అజ్ఞానంగాను, నిర్లక్ష్యంగాను ఉన్న తరగతి ప్రజల మతాన్ని నేను ప్రశ్నిస్తాను..... - CDTel 273.5

నిస్సారమైన చప్పటి వంట వేల ప్రజల శక్తిని క్షీణింపజేస్తుంది. కొందరి భోజనబల్ల వద్ద పుల్ల బ్రెడ్డు, దానికి సరిపడే ఇతర ఆహారం తినటం ప్రమాదకరం. తల్లుల్లారా, మీ కుమార్తెలకి సంగీత పాఠాలు చెప్పించటం కన్నా జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన శాఖల్లో వారికి ఉపదేశమివ్వండి. వంటలోని లోతుపాతుల్ని వారికి నేర్పించండి. ఇది తమ విద్యలో భాగమని, క్రైస్తవులవ్వటానికి ఇది అవసరమని వారికి బోధించండి. ఆహారాన్ని ఆరోగ్యదాయకంగా, రుచిగా తయారుచేస్తే తప్ప, అది క్షీణించే ధాతువుల్ని నిర్మించటానికి మంచి రక్తంగా పరివర్తన చెందదు. CDTel 273.6

[మంచి వంట స్థానాన్ని భర్తీ చెయ్యటానికి పంచదార వాడే ప్రయత్నం -527] CDTel 274.1

[ఆశా నిగ్రహ నియమంలో భోజనబల్ల ప్రభావం-351, 354] CDTel 274.2

[జీర్ణక్రియకు భారం ఎక్కువ అయితే, పరిశోధన అవసరం-445] CDTel 274.3

[తక్కువ వంట, ఎక్కువ సహజ ఆహారపదార్థాలు-166, 546] CDTel 274.4