Go to full page →

దైవదత్తమైన జ్ఞానం CDTel 277

MS 96, 1905 CDTel 277.4

399. తన ప్రజలకి ఆహార సంస్కరణను గురించి ప్రత్యేక జ్ఞానాన్ని ఇవ్వాలని అభిలషిస్తున్నాడు. మన పాఠశాలలు అందించే విద్యలో అది ముఖ్యభాగమై ఉండాలి. కొత్త స్థలాల్లో సత్యాన్ని ప్రకటించేటప్పుడు, పారిశుధ్యాన్ని గూర్చి, వంటచెయ్యటాన్ని గూర్చి ఉపదేశమివ్వటం జరగాలి. మాంసం ఉపయోగించకుండా ఎలా నివసించాలో ప్రజలకి ఉపదేశించండి. ప్రజలకి సామాన్యంగా నివసించటం నేర్పించండి. CDTel 277.5

పండ్లు, గింజల నుంచి సామాన్యమైన, ఇప్పుడు లభ్యమయ్యే వాటికన్నా ఎంతో చవకైన, ఆహార పదార్ధాల్ని తయారు చెయ్యటంలో ప్రభువు మనుషుల్ని నడిపించాడు, ఇప్పుడూ నడిపిస్తున్నాడు. ఖరీదైన ఈ ఆహార ఉత్పత్తుల్ని అనేకమంది కొనలేరు. అయినా వారు నిస్సారమైన ఆహారం తిననవసరం లేదు. అరణ్యంలో వేలాది ప్రజల్ని పరలోకాహారంతో పోషించిన దేవుడే నేడు ఆహారాన్ని సామాన్యంగా తయారు చేసుకోటానికి తన ప్రజలకి జ్ఞానాన్నిస్తాడు. CDTel 278.1

MS 156, 1901 CDTel 278.2

400. ప్రస్తుత కాలానికి దేవుడిచ్చిన సత్యవర్తమానాన్ని వినని వారికి ఈ వర్తమానం వచ్చినప్పుడు, తమ ఆహారం విషయంలో గొప్ప దిద్దుబాటు అవసరమని గుర్తిస్తారు. మాంసాహారం విషయంలో సారాపట్ల వాంఛ కలిగించి శరీరవ్యవస్థని వ్యాధితో నింపుతుంది గనుక దాన్ని విసర్జించాల్సిన అవసరాన్ని వారు గుర్తిస్తారు. మాంసాహారం శారీరక, మానసిక, నైతిక శక్తుల్ని బలహీనపర్చుతుంది. మనిషిని అతడు లేక ఆమె తినే ఆహారమే నిర్మిస్తుంది. మాంసం తినటం, పొగాకు వాడటం, సారా తాగటం వల్ల పాశవిక ప్రవృత్తులు ప్రబలమౌతాయి. మాంసానికి బదులుగా ఉపయోగపడే ఆహారపదార్ధాల్ని తయారు చేసుకోటానికి ప్రభువు తన ప్రజలకి వివేకాన్నిస్తాడు. పప్పులు, గింజలు, పండ్లని మిశ్రమం చేసి ఇంపుగా, నిపుణతతో తయారు చేసిన ఉత్పత్తులు అవిశ్వాసుల్ని ఆకట్టుకుంటాయి. కాని ఈ రకంగా చేసే మిశ్రమాల్లో పప్పులు అతిగా ఉండటం సామాన్యంగా జరుగుతుంటుంది. CDTel 278.3