Go to full page →

ఎక్కువ సామాన్యత, తక్కువ ఖరీదు CDTel 280

(1902) 7T 127,128 CDTel 280.1

402. మన కర్మాగారాల్లో ఉత్పత్తి అయి బయటికి వచ్చే ఆరోగ్య ఆహార పదార్ధాల్ని అనేక విషయాల్లో మెరుగుపర్చవచ్చు. ఆహార ఉత్పత్తులు చెడిపోకుండా వాటిని సామాన్యంగా, ఎక్కువ ఖర్చు లేకుండా భధ్రపర్చటం ప్రభువు తన ప్రజలకి నేర్పిస్తాడు. తాము తన ఉపదేశం ప్రకారం నడుచుకుని సహోదరులతో సామరస్యంగా ఉంటే ఈ శాఖలో ప్రభువు ఉపదేశం పొందగల వారు చాలా మంది ఉన్నారు. CDTel 280.2

MS 75, 1906 CDTel 280.3

403. తక్కువ ఖరీదైన ఆహార పదార్థాలు తయారు చెయ్యండి. వాటిని పోషక పదార్థాలతో తయారు చేస్తే అవి ప్రతీ అవసరాన్ని తీర్చుతాయి..... గింజలు పండ్లతో తయారు చేసే ఉత్పత్తుల్ని తక్కువ ఖర్చుతో తయారు చెయ్యటానికి ప్రయత్నించండి. వీటన్నింటినీ మన అవసరాలు తీర్చటానికి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఖరీదైన ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువ ఆరోగ్యం చేకూరదు. పండ్లు, గింజలు, కూరగాయల నుంచి సామాన్యంగా తయారుచేసిన ఉత్పత్తుల్ని వాడటం ద్వారా అంతే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. CDTel 280.4

(1902) 7T 125,126 CDTel 280.5

404. సామాన్యమైన, తక్కువ ఖరీదైన, ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల్ని మనం వివేకంగా తయారు చెయ్యలి. మన ప్రజల్లో చాలా మంది పేదవారు. పేదలు కొనగల వెలలకి సరఫరా చెయ్యగల ఆరోగ్య ఆహార ఉత్పతుల్ని తయారు చెయ్యాలి. ప్రతీ స్థలంలోను ఉన్న మిక్కిలి బీదవారికి తక్కువ వెలకి ఆరోగ్య ఆహార పదార్థాలు సరఫరా అవ్వాలన్నది ప్రభువు సంకల్పం. ఆహార పదార్ధాల ఉత్పత్తులకి అనేక స్థలాల్లో పరిశ్రమలు స్థాపితమవ్వాలి. ఓ స్థలంలో దేవుని సేవకు దీవెనగా ఉన్నది డబ్బుకి కష్టంగా ఉన్న మరో స్థలంలోనూ దీవెనగా ఉంటుంది. CDTel 280.6

దేవుడు తన ప్రజల తరపున పని చేస్తున్నాడు. వారు వనరులు లేకుండా ఉండాలని ఆయన కోరటం లేదు. ఆదిలో మానవుడికి తానిచ్చిన ఆహారానికి వారిని తిరిగి తీసుకు వస్తున్నాడు. తాను సమకూర్చిన వనరులనుంచి తయారైన పదార్థాలతో కూడిందే వారి ఆహారం కావలసి ఉంది. ఈ ఆహార పదార్థాల్లో ప్రధానంగా ఉపయుక్తం కావలసినవి పండ్లు. గింజలు, పప్పులు, వివిధ రకాల దుంపలు కూడా ఉపయుక్తమౌతాయి. CDTel 280.7