Go to full page →

మన హోటళ్లు నియమానికి నిలబడాలి CDTel 286

ఉత్తరం 201, 1902 CDTel 286.1

414. హోటలు పనిలో మనం నిత్యం కాపాడాల్సిన నియమానికి నీశ్లోదలటానికి దారితీసే ఇది అది ప్రవేశించకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.... తమ జీవితమంతా విచ్చలవిడిగా ఆహార వాంఛని తృప్తి పర్చుకున్నవారు ఆరోగ్యదాయకంగా, సామాన్యంగా, రుచిగా ఆహారం తయారు చెయ్యటాన్ని గ్రహిస్తారని మనం ఎదురు చూడకూడదు. ఇది ప్రతీ ఆసుపత్రి ప్రతీ ఆరోగ్యహోటలు బోధించాల్సిన విజ్ఞాన శాస్త్రం.... CDTel 286.2

మనం నితినుంచి నియమాల్నుంచి వైదొలగటానికి నిరాకరించటం మూలాన మన హోటళ్లకి ఆదరణ తగ్గితే తగ్గనివ్వండి. మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా మనం దేవుని మార్గాన్ని అనుసరించాలి. CDTel 286.3

మీరు న్యాయానికి నీతికి నిలబడి నియమానికి నీళ్లిదలకుండా మన ఆసుపత్రుల్లోకి హోటళ్లలోకి తేకూడనివాటిని విసర్జించటానికి సహాయం చెయ్యటానికి ఈ విషయాల్ని మీకు నా ఉత్తరాల ద్వారా సమర్పిస్తున్నాను. CDTel 286.4