Go to full page →

సంస్కరణల వెంట ఉపదేశం CDTel 295

మన ఆసుపత్రుల్లోని రోగులతో వ్యవహరించటంలో మనం కార్యం నుంచి కారణానికి వెళ్లి ఆలోచించాలి. జీవిత కొలమంతా ఉన్న అలవాట్లు అభ్యాసాలు ఒక్కక్షణంలో మారటం సాధ్యం కాదని మనం గుర్తుంచుకోవాలి. తెలివిగల వంటగత్తె, ఆరోగ్యవంతమైన ఆహారపదార్థాల సమృద్ధి ఉంటే, చక్కని ఫలితాలిచ్చే సంస్కరణల్ని ఆచరణలో పెట్టవచ్చు. కాని వాటిని ఆచరణలో పెట్టటానికి సమయం పడుతుంది. ప్రజలు కోరితేనే తప్ప ఈ దిశలో గట్టి ప్రయత్నం చెయ్యకూడదు. ఓ ఆరోగ్య సంస్కర్తకు నోరూరించే ఆహారం , బాగా పోపు పెట్టిన ఆహారానికి అలవాటు పడ్డ వ్యక్తికి చప్పగా ఉండవచ్చు. ఆహారం విషయంలో దిద్దుబాటు ఎందుకు అవసరమో, ఎక్కువగా పోపు పెట్టిన ఆహారం తినటం వల్ల జీర్ణమండల అవయవాల్లోని సున్నితమైన పొర ఎలా మంటకు గురి అయి దెబ్బ తింటుందో వివరిస్తూ ఉపదేశం ఇవ్వాలి. ఓ సంఘంగా మనం ఎందుకు మన భోజన పాన అలవాట్లలో మార్పులు చేసుకున్నామో వారికి తెలపండి. పొగాకు సారా మనం ఎందుకు ఉపయోగించమో వెల్లడి చెయ్యండి. ఆరోగ్య సంస్కరణ నియమాల్ని స్పష్టంగా సరళంగా వివరించండి. ఇలా చేసిన మీదట భోజనబల్ల మీద రుచిగా తయారు చేసిన ఆరోగ్యకరమైన భోజనం సమృద్ధిగా ఉంచండి. మీరు సంస్కరణ తక్షణ అవసరాన్ని ప్రభావవంతం చెయ్యటానికి మీకు సహాయం చేసి, ఈ సంస్కరణ తమకు గొప్ప మేలు చేస్తుందని గ్రహించటానికి ప్రభువు వారిని నడిపిస్తాడు. తాము అలవాటు పడ్డ పోపు పెట్టిన ఆహారాన్ని వారు మరవలేరు గాని వారికి ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం ఇచ్చి ఆ అనారోగ్యదాయకమైన వంటకాల్ని మరిపించండి. తమ ఆహారపానాల్లో అవసరమైన మార్పు చేసుకుంటేనేగాని చికిత్స తమకు ఉపకరించదని వారికి చూపించండి. CDTel 295.1

427. మన ఆసుపత్రులన్నింటిలోను రోగుల భోజన శాలల్లో ఎక్కువ ఆహా పదార్థాల పట్టిక ఏర్పాటు చెయ్యాలి. మన వైద్యసంస్థల్లో నాకు ఎలాంటి దుర్వ్యయం కనిపించలేదు. కాని నోరూరించే, మంచి, భోజనబల్లల్ని చూశాను. అలాంటి సంస్థల్లో కొంత కాలం ఉన్న రోగులు తాము గదికి, భోజనానికి, చికిత్సకి ఎక్కువ చెల్లిస్తున్నా దానికి తగిన మేలు పొందటం లేదని భావించి వెళ్లిపోటం తరచు జరుగుతుంది. సంస్థకు చెడ్డ పేరు తెచ్చే ఫిర్యాదులకి ఎక్కువ ప్రచారం జరుగుతుంటుంది. CDTel 295.2