Go to full page →

అరకొర ఆహారం లేదా రుచిలేని ఆహారం ప్రభావం CDTel 299

ఉత్తరం 61, 1886 CDTel 299.3

430. విలాసవంతమైన ఆహారవాంఛను తృప్తి పర్చుకునే అలవాటు గలవారు ఆసుపత్రికి వచ్చి, తమ మొదటి భోజనంలోనే త క్కువ పరిమాణాన్ని ఎదుర్కుంటే ఎడ్వంటిస్టులు ఎంతో పేదవారని, వారు ఆకలితో మాడి మరణించే ప్రజలని తాము విన్న నివేదికలు నిజమేనని వెంటనే నమ్ముతారు. ఒక్క అరకొర భోజనం సంస్థకు చెడ్డ పేరు తేవటంలో చేసే హానిని ఇతర దిశల్లో ఎదుర్కోటానికి చేసే ప్రయత్నాలు చూ పే ప్రభావాలు ప్రతిఘటించలేవు. ప్రజలు ఎక్కడున్నారో అక్కడ వారిని కలిసి. వారిని అర్థవంతమైన ఆరోగ్య సంస్కరణ కు తేవాలని ఆకాంక్షిస్తే, విప్ల వాత్మక ఆ హారం వారి ముందు పెట్టటం ద్వారా దాన్ని ప్రారంభించకూడదు. చక్కగా వండిన వంటకాలు భోజన బల్లపై పెట్టాలి. మంచి, రుచిగల ఆహారం సమృద్దిగా పెట్టాలి. లేకపోతే తాము ఏమి తినాలి, అని ఆలోచించే వారు తాము నిజంగా ఆకలితో మాడి మరణిస్తామని భావిస్తారు. చక్కగా తయారు చేసిన మంచి వంటకాలు కావాలి. CDTel 299.4