Go to full page →

మాంసాహారం విధించకూడదు CDTel 301

MS 64, 1901 CDTel 301.1

433. మాంసం తింటూ రోగులకి మాంసాహారం విధించే వైద్యుల్ని మన ఆసుపత్రుల్లో పనికి నియమించ కూడదని దేవుడు నన్ను ఉపదేశించాడు. ఎందుకంటే తమని వ్యాధిగ్రస్తుల్ని చేసే మాంసాహారాన్ని విసర్జించటానికి రోగుల్ని చైతన్యపర్చటంలో వారు విఫలులవుతున్నారు. మాంసం ఉపయోగిస్తూ రోగులకి మాంసాహారం విధించే వైద్యుడు కార్యకారణ నియమపరంగా ఆలోచించడు. పునరుద్ధారకుడి పాత్ర పోషించే బదులు అతడు తన ఆదర్శం వల్ల రోగిని వక్ర తిండికి నడిపిస్తాడు. CDTel 301.2

మన ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు ఈ విషయంలోను ఇతర విషయాల్లోను సంస్కర్తలుగా వ్యవహరించాలి. ఆహారం విషయంలో తప్పుల ఫలితంగా అనేకమంది రోగులు బాధకు గురిఅవుతున్నారు. వారికి మెరుగైన మార్గం చూపించటం అనసరం. అయితే మాంసాహారి అయిన వైద్యుడు ఈపని ఎలా చెయ్యగలడు? తన చెడు అలవాట్ల వల్ల అతడు తన సేవను నిరోధించి, తన ప్రయోజకత్వాన్ని కుంటుబర్చుతాడు. CDTel 301.3

మన ఆసుపత్రుల్లోని అనేకమంది మాంసాహారం గురించి తమలో తాము ఆలోచించుకుని, హేతువాదం చేసుకుని తమ మానసిక, శారీరక శక్తుల్ని దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న ఆకాంక్షతో, మాంసాహారాన్ని పూర్తిగా విడిచి పెట్టుతున్నారు. తమను బాధిస్తున్న రుగ్మతల నుంచి ఇలా విముక్తి పొందుతున్నారు. మన విశ్వాసులు కాని పలువురు ఆరోగ్య సంస్కర్తలవుతున్నారు. ఎందు చేతనంటే దీనిలో స్థిరతను తమ స్వార్ధ దృక్కోణం నుంచి వారు చూశారు. ఆహారం, వస్త్రధారణ విషయాల్లో అనేకులు సంస్కరణ పక్క నిలుస్తున్నారు. సెవెంతుడే ఎడ్వంటిస్టులు అనారోగ్యకరమైన అభ్యాసాల్ని కొనసాగిస్తారా? “కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” అన్న ఆజ్ఞను ఆచరించరా? CDTel 301.4