Go to full page →

ఆసుపత్రుల్లో వివేకంతో చికిత్సలు CDTel 315

ఉత్తరం 79, 1905 CDTel 315.1

457. ఓ ఆరోగ్యకేంద్రం స్థాపించాలని, దానిలో మందుల వినియోగం లే కుడా వ్యాధి నివారణకి వివేకంతో చికిత్సా పద్ధతులు వినియోగించాలని దేవుడు నా కు వెలుగునిచ్చాడు. ఎలా వస్త్రాలు ధరించాలో, ఎలా భోజనపానాలు చెయ్యాలో, సరియైన జీవన అలవాట్ల ద్వారా వ్యాధిని ఎలా నివారించవచ్చో ఈ సంస్థల్లో ప్రజలకి నేర్పించాలి. CDTel 315.2

MS 49, 1908 CDTel 315.3

458. మన ఆసుపత్రుల్లో మనం సామాన్య చికితల్ని ప్రబోధిస్తాం. మదుల వినియోగాన్ని ప్రోత్సహించం. ఎందుకంటే అవి రక్తాన్ని విషయంతో నింపుతాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోటానికి ఎలా తినాలి, ఎలా పానీయాలు తీసుకోవాలి, ఎలా వస్త్రాలు ధరించాలి అన్న విషయాలపై జ్ఞానయుతమైన ఉపదేశం ఈ సంస్థల్లో ఇవ్వాలి CDTel 315.4

ఉత్తరం 73a1896 CDTel 315.5

459. ఆరోగ్యసంస్కరణ సమస్య కలిగించాల్సినంతగా ఆందోళన కలిగించటం లేదు. సామాన్యమైన ఆహారం, వ్యర్ధమైన శరీర శక్తుల్ని భర్తీచేసే పనిని ప్రకృతికి విడిచి పెడ్తూ, మందుల వినియోగాన్ని మానటం, రోగులకి ఆరోగ్యాన్ని పునరుద్ధరించటంలో మన ఆసుపత్రుల్ని శక్తిమంతం చేస్తాయి. CDTel 315.6