Go to full page →

జెమ్స్, రోల్స్ CDTel 331

(R.&.H. మే, 8, 1883) CDTel 331.3

503. సోడా లేక బేకింగ్ పౌడరు వల్ల పొంగిన వేడి బిస్కెట్లు మన భోజన బల్లలమీద కనబడ కూడదు. అట్టి సంయోగాలు కడుపులో ప్రవేశించటానికి అర్హమైనవి కావు. పొంగిన వేడిబ్రెడ్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ముతక గోధుమ జెము ఆరోగ్యదాయకమే గాక, రుచికరం. ముతక గోధుమ పిండి, శుద్ధమైన చన్నీళ్లు, పాలుకలిపి వాటిని తయారు చెయ్యవచ్చు. కాని మన ప్రజలకు సామాన్యత నేర్చటం కష్టం. ముతక గోధుమ జెము మేము సిఫారసు చేసినప్పుడు, “మేము వాటిని చెయ్యగలం” అంటారు మన మిత్రులు. అవి బేకింగ్ పౌడరుతో లేక పుల్లని పాలు సోడాతో పొంగినప్పుడు ఆశాభంగం చెందుతాం అంటారు. సంస్కరణ సూచనలేవీ వీరిలో కనిపించవు. జల్లించని ముతక గోధుమ పిండి సున్నం లేని స్వచ్చమైన నీళ్లు, పాలతో కలిపి చేసిన జెమ్స్ అత్యుత్తమ జెమ్స్. నీళ్లలో సున్నముంటే, ఎక్కువ తీపిపాలు ఉపయోగించండి లేక పిండీలో ఓ గుడ్డు కలపండి. జెమ్స్ ని వేడిగల అవలో స్థిరమైన మంట పై బాగా బేక్ చెయ్యాలి. CDTel 331.4

రోల్స్ చెయ్యటానికి సున్నంలేని నీళ్లు, పాలు లేక కొంచెం మీగడ ఉపయోగించండి. పిండి ముద్దను గట్టిగా చేసి బిస్కెట్లకు నీడ్ చేసినట్టు నీడ్ చెయ్యండి. వాటిని అవలోని ఇనపచట్రంపై బేక్ చెయ్యండి. ఇవి తియ్యగా మధురంగా ఉంటాయి. వాటిని బాగా నమలటం అవసరమౌతుంది. నమలటం పళ్లకి కడుపుకి రెంటికీ మేలు చేస్తుంది. అవి మంచి రక్తం ఉత్పత్తి చేసి శక్తినిస్తాయి. అలాంటి బ్రెలో, మన దేశంలో సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు, గింజలతో ఇంకే గొప్ప విలాస ఆహారపదార్థాలు కోరుకోగలం? CDTel 331.5