Go to full page →

పుష్కలంగా కూరగాయలు CDTel 334

ఉత్తరం 3, 1884 CDTel 334.1

514. మనం తినే ఆహారమే మనల్ని నిర్మిస్తుంది. జంతు మాంసం తినటం ద్వారా పాశవిక ఉద్రేకాల్ని బలపర్చుకుందామా? ఈ అనుచిత ఆహారం పట్ల అభిరుచి పెంచుకునే బదులు మనం పండ్లు, గింజలు, కూరగాయలు తినడం మంచిది.... మాంసం విడిచి పెట్టి ఆరోగ్యదాయకం, పౌష్టికం అయిన వినిధ సమాన్య వంటకాలు తయారు చేసుకోవచ్చు. మనుషులు ఆరోగ్యవంతులుగా ఉండటానికి కూరగాయలు, పండ్లు, గింజలు పుష్కలంగా తీసుకోవాలి. CDTel 334.2

[సహాయకుల భోజనం కోసం - 444, 651] CDTel 334.3

[మాంసాహారం బదులు - 492, 649, 765, 795] CDTel 334.4

[విలాసవంతమైన ఆహారం స్థానే - 312] CDTel 334.5

[ప్రకృతి చట్టాల్ని ఉల్లంఘించేవారికి ఇష్టముండవు - 204, 563] CDTel 334.6

[మాంసాహారం కూరగాయల నుంచి వచ్చే రెండోరకం ఆహారం - 482] CDTel 334.7

ఉత్తరం 72, 1896 CDTel 334.8

515. ప్రభువు తన ప్రజల్ని పండ్లు, కూరగాయలు, గింజలతో కూడిన సొమాన్య ఆహారానికి తిరిగి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. కొందరు కూరగాయలు తీసుకోలేరు CDTel 334.9

ఉత్తరం 45, 1903 CDTel 334.10

516. ఓ ఆసుపత్రిలో రకరకాల రుచులు ఆహారావసరాలు గలవారు ఉంటారు. కొందరి ప్రత్యేకావసరాలికి చక్కగా తయారు చేసిన కూరగాయల వంటకాలు అవసరమౌతాయి. కొందరికి కూరగాయలు పడవు. అవి వారిని ఆరోగ్యపరంగా బాధలకు గురిచేస్తాయి. CDTel 334.11