Go to full page →

శిబర సమావేశ ప్రాంగణంలో చిన్న చిన్న వస్తువుల అమ్మకాలు CDTel 340

ఉత్తరం 259, 1889 529. కొన్ని సంవత్సరాల కిందట శిబిర సమావేశాలు జరుగుతున్న తరుణంలో మాట్లాడుతూ నేను చిన్న పిల్లలకి పెద్దవారికి తాము క్యాండీలకి వ్యయం చేస్తున్న ద్రవ్యాన్ని మిషనెరీ సేవ నిమిత్తం మిషనెరీ డిబ్బీలో వేసి, తద్వారా తమ బిడ్డలకి ఆత్మత్యాగ స్వభావాన్ని అందించాల్సిందిగా తల్లితండ్రుల్ని ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తుండగా ఆ ప్రాంగణం లోని ప్రజలకి చీజు, ఇంకా ఇతర హానికరమైన పదార్ధాలు, క్యాండీలు తెచ్చి అమ్ముతున్న శిబిర నిర్వాహకులకి అందించటానికి దేవుడు ఓ’ మందలింపు సందేశాన్నిచ్చాడు. CDTel 340.6

MS 87, 1908 CDTel 341.1

530. మన శిబిర సమావేశాల్లో ఇవ్వాల్సిన ఆహారం గురించి నాకు ప్రభువు వెలుగునిచ్చాడు. ఆరోగ్య సంస్కరణ నియమాలకి ప్రతికూలమైన ఆహార పదార్ధాల్ని కొన్నిసార్లు శిబిర సమావేశాల ప్రాంగణంలోకి తీసుకురావటం జరుగుతుంది. CDTel 341.2

మనం దేవుడిచ్చే వెలుగులో నడవటానికి మన ప్రజల్ని - పెద్దవారిని, చిన్నవారిని కేవలం తిండి వాంఛను తృప్తి పర్చుకోటానికి తినే ఆహార పదార్థాల్ని విసర్జించటానికి చైతన్య పర్చాలి. క్యాండీలు, గమ్ లు ఐస్ క్రీముల వంటి తిను బండారాల్ని త్యాగం చేసి ఆ డబ్బును ప్రతీ గృహంలోను ఉండాల్సిన ఆత్మత్యాగ డిబ్బీలో వేయటం మనం మన పిల్లలకి నేర్పించాలి. ఈ విధంగా దేవుని సేవ నిమిత్తం పెద్ద చిన్న మొత్తాలు ఆదా అవుతాయి. CDTel 341.3

ఆరోగ్య సంస్కరణ నియమాల పై ఉపదేశం అవసరమైన దైవ ప్రజలు తక్కువ సంఖ్యలో లేరు. ఆరోగ్య ఆహారపదార్ధాల ఉత్పత్తిదారులు తయారు చేసి నిరపాయమైన ఆహారపదార్థాలుగా సిఫారసు చేసే రకరకాల తీపి పదార్థాలున్నాయి. కానీ వాటిని గురించి నేను ఇవ్వాల్సివున్న సాక్ష్యం అది కాదు. అవి వాస్తవానికి ఆరోగ్యదాయకం కావు. వాటి వాడకాన్ని ప్రోత్సహించకూడదు. మనం మరింత సామాన్యమైన పండ్లు, పప్పులు, గింజలు, కూరగాయల భోజనానికి కట్టుబడి వుండాలి. CDTel 341.4

ఆరోగ్య సంస్కరణ పై దేవుడు మన ప్రజలకిచ్చిన వెలుగుకి వ్యతిరేకంగా పని చేసే ఆహార పదార్థాల్ని గాని, లేక తినుబండారాల్ని గాని శిబిర సమావేశాల ఆవరణ లోపలికి తేకూడదు, తేనివ్వకూడదు. వాటి అమ్మకాల ద్వారా వచ్చే ద్రవ్యాన్ని ఓ మంచి పనికి ఉపయోగించ వచ్చు అనటం ద్వారా తిండి తినటానికి కలిగే శోధనని మనం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుందుము గాక! స్వార్ధాశల తృప్తికి కలిగే శోధనలన్నింటినీ బలంగా ప్రతిఘటించాలి. మంచి జరుగుతుందన్న నెపంతో వ్యక్తికి మేలు కానిదేదీ చేయటానికి మనం ప్రయత్నించకూడదు. ఆత్మత్యాగం చేసే, అయినా ఆరోగ్యవంతంగా, నివసించే క్రియాశీల మిషనెరీలంటే ఎవరో వ్యక్తిగతంగా తెలుసుకుందుముగాక. CDTel 341.5