Go to full page →

భాగం II - పాలు, పంచదార CDTel 342

(1870) 2T 368,369 CDTel 342.5

533. ఇప్పుడు పాలు పంచదార గురించి: ఆరోగ్యసంస్కరణ గురించి భయపడి, వీటిని ఇష్టానుసారంగా ఉపయోగించకూడదని అది చెబుతుంది గనుక, దానితో తమకు సంబంధం లేదని చెప్పే వ్యక్తులు నాకు తెలుసు. మార్పును అతి జాగ్రత్తగా చెయ్యాలి. మనం జాగ్రత్తగా, వివేకంగా అడుగులు వెయ్యాలి. దేశంలోని జ్ఞాన వివేకాలు గల స్త్రీ పురుషుల్ని ఏది ఆకట్టుకుంటుందో ఆ విధానాన్ని మనం అనుసరించాలి. ఎక్కువ పరిమాణంలో పాలు, పంచదార కలిపి తీసుకోటం ఆరోగ్యానికి హానికరం. అవి వ్యవస్థకు మలిన పదార్థాల్ని ఇస్తాయి. ఏ పశువుల నుంచి పాలు సంగ్రహిస్తామో అవి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవు. అవి వ్యాధిగ్రస్త మౌతాయి. ఓ ఆవు ఉదయం ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించి, రాత్రి కాకముందే చచ్చిపోవచ్చు. అంటే అది ఉదయం జబ్బుగా ఉంది; దాని పాలు రోగగ్రస్తం. కాని అది మీకు తెలియలేదు. జంతు ప్రపంచమే రోగగ్రస్తం. మాంసాహారం రోగగ్రస్తం. జంతువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిస్తే ప్రజలు పాలు, పంచదార కలిపి ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దని చెప్పక ముందు మాంసాహారం తీసుకోవల్సిందిగా నేను సిఫారసు చేస్తాను. పాలు, పంచదార చేసే హాని అది చేయదు. పంచదార వ్యవస్థని అడ్డుకుంటుంది. జీవన యంత్రం పనికి ఆటంకం కల్పిస్తుంది. CDTel 342.6

(1870) 2T 370 CDTel 343.1

534. నేను సహోదరులు, సహోదరీలతో కలిసి భోజనం చెయ్యటం తరచుగా జరుగుతుంటుంది. వారు పాలు, పంచదార ఎక్కువ పరిమాణంలో నియోగించటం చూస్తుంటాను. ఇవి శరీర వ్యవస్తను అడుకుని జీర్ణమండల అవయవాలకి బాధ కలిగించి మెదడును ప్రభావితం చేస్తాయి. CDTel 343.2

[సందర్భానికి 527 చూడండి] CDTel 343.3

[C.T.B.H.57] (1890) C.H.154 CDTel 343.4

535. కొందరు జావలో పాలు, ఎక్కువ పంచదార వాడుతూ తాము ఆరోగ్యసంస్కరణని అవలంబిస్తున్నామని తలస్తారు. అయితే పాలు, పంచదార సంయోగం కడుపులో పులుపు పుట్టించటం ద్వారా హాని చేస్తుంది. CDTel 343.5

(1905) M.H.302 CDTel 343.6

536. పాలు, గుడ్లు, పంచదార ముఖ్యమైన దినుసులుగా ఉండే పుడ్డింగులు మరింత హానికరం. పాలు, పంచదార ధారాళంగా ఉపయోగించటం మానాలి. CDTel 343.7

[ఐస్ క్రీమ్-530,540] CDTel 343.8

[పాలతోగాని, వెన్నతో గాని కేక్ తినటం - 552] CDTel 343.9