Go to full page →

మసాలాలు కడుపులో మంట పుట్టించి అస్వాభావిక వాంఛలు కలిగిస్తాయి CDTel 351

R.& H., నవ. 6, 1883 CDTel 351.1

558. కడుపులో మంట పుట్టించే పదార్థాలేమీ లేని ఆరోగ్యవంతమైన ఆహారం మాత్రమే మన భోజన బల్లల పై ఉండాలి. ఆహారాన్ని తయారు చేయ్యటంలో ఉపయోగించే మసాలాలు భోజన సంభారాలు సారాకి తృష్ణ పుట్టిస్తాయి. మంటను తగ్గించటానికి పానీయాన్ని కోరతాయి. ఖండంలో నేను తరచుగా చేసే ప్రయాణాల్లో హోటళ్లు, డైనింగ్ కార్లపట్ల ఆదరణ చూపను. దానికి కారణం వాటిలో వడ్డించే భోజనం నేను తినలేను. వంటకాలు ఉప్పు కారంతో పోపు పెట్టినవి. అవి దాదాపు తాళలేని దాహం పుట్టిస్తాయి.... కడుపులోని సున్నితమైన పొరని కందజేసి దానికి మంట కలిగిస్తాయి. భోజన బల్లల మీద వడ్డించే విలాసవంతమైన ఆహారం, పిల్లలకి పెట్టే భోజనం అలాంటిది. దానికి భయం పుట్టించే స్వభావం, నీరు చల్లార్చలేని దాహం పుట్టించే శక్తి ఉన్నది..... ఆహారాన్ని మసాలాలు, మసాలాకారం, ఎక్కువ పరిమాణంలో ఉప్పు ఉపయోగించకుండా సాద్యమైనంత సామాన్యంగా తయారు చెయ్యాలి. CDTel 351.2

[మసాలా కారంతో నిండిన ఆహారపదార్ధాలు భోజనంతో పానీయాల్ని కోరటానికి నడిపిస్తాయి-570] CDTel 351.3

ఉత్తరం 53, 1898 CDTel 351.4

559. కొందరు తమ ఆకలిని ఎలా పెంచుకుంటారంటే, అది ఏ వంటకం కోరుతుందో దాన్ని సమకూర్చితేనే వారికి ఆహారం తృప్తినిస్తుంది. మసాలాలు మసాలాకారాలతో తయారు చేసిన ఆహారం తమ ముందు పెట్టితే ఈ కారం కొరడా ఝుళిపించటం ద్వారా వారు తమ కడుపు పని చేసేటట్లు చేస్తారు. ఎందుకంటే ఉద్రేకం పుట్టించని ఆహారాన్ని గుర్తించ కుండా ఉండేటట్లు దాన్ని దుర్వినియోగం చెయ్యటం జరుగుతున్నది. CDTel 351.5

(1890) C.T.B.H.17 CDTel 352.1

560. మసాలాలు వేసి కారంగా చేసిన భోజన పదార్థాలు, కొవ్వుతో నిండిన పులుసులు, కేకులు, పే స్త్రీల వంటి విలాసవంటకాల్ని పిల్లల ముందు పెట్టటం జరుగుతున్నది. ఎక్కువగా పోపు పెట్టిన ఈ ఆహారం కడుపును కందజేసి, ఇంకా బలమైన ఉత్తేజకాలకి వాంఛను పుట్టిస్తుంది. అనుచిత ఆహారం కోసం శోధన పుట్టించటమే కాక- - - బోజన సమయంలోలు దీన్ని యధేచ్చగా తినటానికి- - - వారిని మధ్య మధ్య చిరుతిళ్లు తినటానికి కూడా అనుమతించటం జరుగుతుంటుంది. వారు పన్నెండు లేక పధ్నాలుగేళ్ల వయసుకు వచ్చేసరికి అజీర్తి రోగులుగా నిర్ధారణ అవుతుంది. CDTel 352.2

మద్యానికి అలవాటు పడ్డ వ్యక్తి కడుపు ఫోటో మీరు చూసి ఉండవచ్చు. మసాలా కారాలతో తయారు చేసిన ఆహారం కలిగించే మంట ప్రభావం వల్ల అలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. కడుపు అలాంటి స్థితిలో ఉండటంతో ఆకలి తృప్తి పర్చటానికి మరింత ఎక్కువ, మరింత బలమైన పదార్ధం కోసం వాంఛ కలుగుతుంది. CDTel 352.3

[సందర్భం కోసం 355 చూడండి] CDTel 352.4