(1868) 1T 681 CDTel 365.2
593. అనేకులు దాన్ని ఓ విధిగా భావించరు. అందుకే ఆహారం సరిగా తయారుచెయ్యటానికి ప్రయత్నించరు. కొవ్వు, బటర్ లేక మాంస పదార్ధాలు లేకుండా ఆహారాన్ని సామాన్యంగా, ఆరోగ్యంగా, సులభంగా తయారు చెయ్యవచ్చు. సామాన్యతతో నిపుణతను జోడించాలి. ఇది చెయ్యటానికి స్త్రీలు అధ్యయనం చెయ్యాలి. చేసి దాన్ని ఓర్పుతో ఆచరణలో పెట్టాలి. CDTel 365.3
[నియమం ప్రకారం పంది కొవ్వుని విసర్జించాలి-317] CDTel 365.4
[ C.T.B.H.47] (1890) C.H.115 CDTel 365.5
594. పండ్లు, గింజలు, కూరగాయల్ని మసాలాలు ఏ రకమైన జిడ్డునూనె లేకుండా పాలు లేదా వెన్నతో తయారుచేస్తే ఆ ఆహారం మిక్కిలి ఆరోగ్యవంతమవుతుంది. CDTel 365.6
(1868) 2T 63 CDTel 366.1
595. ఆహారాన్ని సాదాగా తయారుచేసుకోవాలి. అయినా చక్కగా, నోరూరించేలా తయారుచెయ్యాలి. జిడ్డునూనెని దూరంగా ఉంచాలి. అది మీరు తయారుచేసే ఏ ఆహారాన్నయినా అపవిత్రం చేస్తుంది. CDTel 366.2
[C.T.P.H.46,47] (1890) C.H.114 CDTel 366.3
596. అనేకమంది తల్లులు తమ కుటుంబాలకి ఉచ్చుగా మారే ఆహారం తయారుచేసి భోజనబల్లల మీద పెడ్తారు. పెద్దలు పిన్నలు మాంసపదార్ధాలు, బటర్, చీజ్, పాలు పంచదార బాగా ఉన్న పేస్టీలు, మసాలాలు మస్తుగా ఉన్న ఆహారపదార్ధాలు, మసాలా కారాలు ఇష్టా రాజ్యంగా తీసుకుంటారు. కడుపుని కల్లోలపర్చి, నరాల్ని ఉద్రేకపర్చి, మానసిక దౌర్బల్యాన్ని కలిగించటంలో తమ పనిని అవి చేస్తాయి. రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలు అలాంటి పదార్థాల్ని మంచి రక్తంగా మార్చలేవు, ఆహారం తయారు చెయ్యటానికి ఉపయోగించే జిడ్డు నూనె జీర్ణ క్రియని కష్టతరం చేస్తుంది. CDTel 366.4
ఉత్తరం 322, 1905 CDTel 366.5
597. వేపిన బంగాళాదుంపలు ఆరోగ్యకరం కావని మా నమ్మకం. ఎందుకంటే వాటిని తయ- కు చెయ్యటంలో నూనె లేక బటర్ ఉపయోగించటం జరుగుతుంది. బేక్ చేసిన లేదా ఉడకబెట్టిన బంగాళా దుంపల పై కొంచెం ఉప్పు చల్లిన వెన్నతో తినటం మిక్కిలి ఆరోగ్యకరం. మిగిలిన ఆ ఐరిష్ బంగాళాదుంపల్ని కొంచెం వెన్న కొంచెం ఉప్పుతో మళ్లీ బేక్ చేస్తే అవి మంచి ఆహారమౌతాయి. CDTel 366.6
ఉత్తరం 297, 1904 CDTel 366.7
598. మీ భోజనబల్లవద్ద భోజనానికి కూర్చునే వారందరూ చక్కగా వండిన, ఆరోగ్యవంతమైన, రుచిగల ఆహారాన్ని దాని మీద చూడనివ్వండి. సహోదరుడు - నీ శరీరం రోగగ్రస్తంగా కొనసాగకుండేందుకు, నీ అన్న పానాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమంగా భోజనం చెయ్యాలి. జిడ్డు నూనె వాడని ఆహారాన్ని తినాలి. CDTel 366.8
(1868) 2T 45 CDTel 367.1
599. మసాలాలు, మాంసం, అన్ని రకాల కొవ్వు నూనె ఉపయోగించకుండా తయారు చేసిన సాదాసీదా ఆహారం నీకెంతో మేలు చేస్తుంది. నీ భార్యకి ఎంతో బాధ, వేదన, నిస్పృహ తప్పుతుంది. CDTel 367.2
600. గింజలు, పండ్లు, కొవ్వునూనె లేకుండా సాధ్యమైనంత సహజంగా తయారుచేసిన ఆహారం, మరణం చవిచూడకుండా పరలోకానికి ఆరోహణమవ్వటానికి కని పెడున్న ప్రజల ఆహారం కావాలి. CDTel 367.3
[వైట్ గృహంలో పందికొవ్వు వినియోగం లేదు-అనుబంధం 1:4] CDTel 367.4
[బిర సమావేశాల్లో ఆహారాన్ని కొవ్వునూనె లేకుండా సాదాగా తయారు చెయ్యా లి-124] CDTel 367.5
[వైట్ గృహంలో కొవ్వునూనెల మిశ్రమం వినియోగించలేదు — అనుబంధం 1:21] CDTel 367.6