(1902) 7T 135 CDTel 368.3
603. పాలు, గుడ్లు, బటర్ని మాంస పదార్థాలుగా వర్గీకరించకూడదు. కొందరి విషయంలో గుడ్లు మేలు చేస్తాయి. పాలు, గుడ్ల వాడకం పూర్తిగా విసర్జించాల్సిన సమయం ఇంకా రాలేదు. చాలామట్టుకు బ్రెడ్, పాలు తీసుకుని నివసించే పేద కుటుంబాలున్నాయి. వారికి పండ్లు లభించవు. పప్పు ఆహారపదార్థాల్ని వారు కొనలేరు. ఇతర సువార్త కృషిలోలా ఆరోగ్యసంస్కరణని ఉపదేశించటంలో ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ వారిని మనం కలవాలి. రుచిగల, బలవర్ధకమైన, చౌకైన ఆరోగ్య సంస్కరణ ఆహారపదార్థాల్ని ఎలా తయారు చెయ్యాలో నేర్పించే వరకు ఆరోగ్య సంస్కరణ ఆహారం గురించి మిక్కిలి ప్రగతిశీల ప్రతిపాదనలు వారికి సమర్పించకూడదు. CDTel 368.4
ఆరోగ్యసంస్కరణ ప్రగతి శీలమవ్వాలి. పాలుగాని బటర్ గాని ఉపయోగించకుండా ఆహారం ఎలా తయారుచెయ్యాలో ప్రజలకి నేర్పించాలి. మనుషుల మధ్య పెరుగుతున్న దుర్మారతకి దీటుగా, గుడ్లు, పాలు, వెన్న లేక బటర్ ఉపయోగించటంలో ప్రమాదం పెరిగే కాలం త్వరలో వస్తుందని వారికి చెప్పండి. పతనమైన మానవ జాతి దుర్మార్గత కారణంగా భూమికి శాపంగా ఉన్న వ్యాధుల తాకిడి కింద జంతు సృష్టి యావత్తు మూలిగే సమయం దగ్గరలోనే ఉన్నది. CDTel 368.5
[ముఖ్యంగా పాలు అవసరమైన వారు వాటిని పూర్తిగా విసర్జించకూడదు-625] CDTel 369.1
[పాలు లేకుండా వండటం ప్రజలకి నేర్పాల్సి ఉంది-807] CDTel 369.2
ఉత్తరం 1, 1873 CDTel 369.3
604. మేము ఎప్పుడూ కొద్దిగా పాలు, కొద్దిగా పంచదార ఉపయోగిస్తాం. వీటి వాడకాన్ని మా రచనల్లో గాని, మా ప్రసంగాల్లోగాని మేము ఖండించలేదు. పశువులు ఎంతగా వ్యాధిగ్రస్తమవుతాయంటే వాటిని విసర్జించాల్సి వస్తుంది. కాని పంచదార పాలని పూర్తిగా విడిచి పెట్టాల్సిన సమయం ఇంకా రాలేదు. CDTel 369.4
[పాలు, పంచదారని కలిపి ఉపయోగించటం, విభాగం XX లో “పాలు పంచదార” చూడండి] CDTel 369.5
(1870) 2T 369 CDTel 369.6
605. మనం ఏ ఆవుల నుంచి పాలు సేకరిస్తామో అవి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవు. అవి రోగగ్రస్తం కావచ్చు. ఓ ఆవు ఉదయం బాగా ఉండవచ్చు, రాత్రి పడకముందు చచ్చిపోవచ్చు. అంటే అది ఉదయమే వ్యాధిగ్రస్తమై ఉందన్నమాట. దాని పాలు రోగపూరితమైనా మీకు తెలియలేదు. జంతు సృష్టి రోగగ్రస్తం. CDTel 369.7
యూనియస్ కాన్ఫరెన్స్ రికార్డ్ (ఆస్టైలేషియన్) జూలై 28, 1899 CDTel 369.8
606. జంతు సంబంధిత ఆహారం మనం విసర్జించాల్సిన సమయం ఎక్కువ దూరంలో లేదని నాకు వచ్చిన వెలుగు సూచిస్తున్నది. పాలు కూడా విసర్జించాల్సి వస్తుంది. వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దేవుని శాపం భూమి మీద ఉన్నది. ఎందుకంటే మానవుడు భూమిని శాపగ్రస్తం చేస్తున్నాడు. CDTel 369.9