Go to full page →

భాగం IV - ఒలీవలు, ఒలీవ నూనె CDTel 372

బలవర్ధకమైన రుచికరమైన ఆహారంలో భాగం CDTel 372

(1905) M.H.298 CDTel 372.6

614. పప్పుల్లా ఒలీవల్ని సరిగా తయారుచేసినప్పుడు బటర్, మాంసపదార్ధాల స్థానాల్ని అవి భర్తీ చేస్తాయి. ఒలీవల్లోని నూనె జంతువు నూనె లేక కొవ్వు కన్నా శ్రేష్ఠం. అది విరేచనకారిగా పనిచేస్తుంది. దాని వినియోగం క్షయరోగులకి మేలు చేస్తుంది. కందిన, మంట పెట్టే కడుపుని స్వస్తపర్చుతుంది. CDTel 372.7

(1902) 7T 134 CDTel 373.1

615. ప్రతీ భోజనంతోను తిని మంచి ఫలితాలు పొందే రీతిగా ఒలీవల్ని తయారుచేసుకోవచ్చు. బటర్ వినియోగం ద్వారా పొందాలని ఆశించే మేళ్లని సరిగా తయారుచేసిన ఒలీవలు తినటం ద్వారా పొందవచ్చు. ఒలీవల్లోని నూనె మలబద్దాన్ని నివారిస్తుంది. క్షయరోగులకి, కందిన, మంట పెట్టే కడుపుతో బాధపడేవారికి మందుకన్నా ఎక్కువ ఉపకారం చేస్తుంది. పరోక్షంగా జంతువులనుంచి వచ్చే నూనె కన్నా అది ఆహారంగా మెరుగైనది. CDTel 373.2

616. ఒలీవల్లోని నూనె మలబద్ధానికి, మూత్రపిండాల వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుంది. CDTel 373.3