Go to full page →

ఇతర భాగాలకి పప్పుల నిష్పత్తి CDTel 376

ఉత్తరం 135, 1902 CDTel 376.8

622. పప్పు ఆహారపదార్ధాల్ని సరిగా వినియోగించటం పై శ్రద్ధ అవసరం. కొన్ని పప్పులు ఇతర పప్పులంత ఆరోగ్యదాయకం కావు. మీరు కొనుగోలు చేసేవాటిలో కొన్ని పప్పు పదార్ధాలకే పరిమితం చేసి ఖర్చు తగ్గించుకోటానికి చూడకండి. ఈ ఆహారపదార్థాల్ని యథేచ్చగా వాడకూడదు. వాటిని తక్కువ వాడితే దాని ఫలితం ఎక్కువ తృప్తిగా ఉంటుంది. కొన్ని కొన్ని రెసిపీల్లో సూచించిన రీతిగా ఇతర దినుసులతో వాటిని ఎక్కువ నిష్పత్తుల్లో మిళితం చేస్తే అవి ఆ ఆహారాన్ని విలాసవంతం చేస్తాయి. దాన్ని శరీర వ్యవస్థ సరిగా జీర్ణించుకోలేదు. CDTel 376.9

(1902) 7T 134 CDTel 377.1

623. పప్పు ఆహారపదార్థాల్ని తరచు అవివేకంగా ఉపయోగించటం జరుగుతుందని, పప్పుల్ని పెద్ద పరిమాణంలో వాడటం జరుగుతున్నదని, కొన్ని పప్పులు ఇతర పప్పులంత ఆరోగ్యవంతం కావని నాకు ఉపదేశం వచ్చింది. వేరుశెనగ పప్పుకన్నా బాదం పప్పు మంచిది. కాని పోషకాలు గల జీర్ణమయ్యే ఆహారం తయారుచెయ్యటంలో వేరుశనగపప్పు తక్కువ పరిమాణంలో ఇతర గింజలతో కలిపి వాడవచ్చు. CDTel 377.2

ఉత్తరం 188, 1901 CDTel 377.3

624. మూడేళ్ల క్రితం నాకో ఉత్తరం వచ్చింది. అందులో ‘పప్పు పదార్థాలు నాకు పడవు. వాటిని నా కడుపు పరిష్కరించలేదు” అని వుంది. అప్పుడు రకరకాల రెసిపీలు నాకు సమర్పించటం జరిగింది. వాటితో కలిసే ఇతర దినుసుల్ని పప్పులతో మిళితం చెయ్యాలని, అవి పప్పులకి మరీ ఎక్కువ నిష్పత్తిలో ఉండకూడదని సూచించేది వాటిలో ఒకటి. పదింట ఒక వంతు నుంచి ఆరింట ఒక వంతు వరకు పప్పులు సరిపోతాయి. మిశ్రమాల్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. దీన్ని మేము విజయవంతంగా చేశాం . CDTel 377.4

[చాలా ఎక్కువ పరిమాణంలో పప్పుల వినియోగం-400,411] CDTel 377.5

[ప్రప్పు పదార్థాల్ని అందరూ ఉపయోగించలేరు-589] CDTel 377.6

[వైట్ గృహంలో పప్పు ఆహారపదార్థాల వినియోగం-అనుబంధం 1:16] CDTel 377.7