Go to full page →

ఆహార మూల పదార్థాల భర్తీలో వైఫల్యం CDTel 381

(1909) 9T 162 CDTel 381.1

631. బటర్, గుడ్లని స్వేచ్ఛగా వాడటం వల్ల పిల్లలకి వ్యాధులు సంభవించే ప్రమాదం గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ సరియైన పోషణనిచ్చి, జాగ్రత్తగా పెంచిన కోడి పెట్టల గుడ్లు ఉపయోగించటాన్ని నియమ ఉల్లంఘనగా పరిగణించకూడదు. కొన్ని విషాలకి విరుగుడుగా పనిచేసే ఔషధ పదార్ధాలు గుడ్లలో ఉన్నాయి. CDTel 381.2

పాలు, గుడ్లు, బటర్ వాడకపోటం వల్ల మన ప్రజల్లో కొందరు తమ శరీరాలకి సరియైన పౌష్టికతని సరఫరా చెయ్యటం లేదు. ఫలితంగా వారు దుర్బలులై పనిచెయ్యలేకపోతున్నారు. ఆరోగ్యసంస్కరణకి ఇలా చెడ్డ పేరు వస్తున్నది. పటిష్ఠంగా నిర్మించటానికి మేము ప్రయత్నిస్తున్న పనిని దేవుడు కోరని అన్య విషయాలతో అస్తవ్యస్తం చెయ్యటం జరుగుతున్నది. సంఘం శక్తి సామర్థ్యాలు కుంటుబడుతున్నాయి. అయితే ఈ అతి తీవ్ర అభిప్రాయాల దుష్ఫలితాల్ని నివారించటానికి దేవుడు కలుగజేసుకుంటాడు. పాప మానవుల నడుమ సువార్త సామరస్యాన్ని పెంపొందించాల్సి ఉంది. ధనవంతుల్ని పేదవారిని క్రీస్తు పాదాల చెంతకు తేవాల్సి ఉంది. CDTel 381.3

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పాలు, మీగడ గుడ్లు వంటి కొన్ని ఆహార పదార్థాల్ని విసర్జించాల్సిన సమయం వస్తుంది. అయితే తీవ్ర నిర్బంధాల్ని ముందే విధించుకోటం ద్వారా మన మీదికి ఆందోళనను తెచ్చుకోనవసరం లేదు. ఆ పరిస్థితి చోటు చేసుకునే వరకు వేచి ఉండండి. ప్రభువు దానికి మార్గం సిద్ధం చేస్తాడు. CDTel 381.4

[సందర్భానికి 327 చూడండి] CDTel 381.5