Go to full page →

మాంసాహారం ఇప్పుడు మరింత అపాయకరం CDTel 397

(1905) M.H.331 CDTel 397.5

661. మాంసం ఎన్నడూ ఉత్తమాహారం కాదు. కాగా ఇప్పుడది రెండురెట్లు అభ్యంతరకరం. ఎందుకంటే జంతువుల్లో వ్యాధి వేగంగా పెరుగుతున్నది. CDTel 397.6

(1902) 7T 124 CDTel 397.7

662. జంతువులు ఇంతలంతలుగా వ్యాధిగ్రస్తమౌతున్నాయి. సెవంతుడె ఎడ్వంటిస్టులేగాక అనేకులు మాంసాహారాన్ని విసర్జించే సమయం త్వరలోనే వస్తుంది. మనుషులు మాంసం తినాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యదాయకమైన, పోషణనిచ్చే ఆహారపదార్ధాల్ని తయారు చేసుకోవాలి. CDTel 397.8

MS 133, 1902 CDTel 398.1

663. సత్యం తెలిసినవారు సరియైన నియమాల పక్షంగా ఎప్పుడు నిలకడగా నిలబడతారు? వారు ఆరోగ్య సంస్కరణ నియమాలకి ఎప్పుడు నిజాయితీగా నిలబడతారు? మాంసాహారం అపాయకరమని ఎప్పుడు నేర్చుకుంటారు? మాంసాహారం ఎప్పుడైనా క్షేమదాయకమై ఉంటే అది ఇప్పుడు కాదని చెప్పవలసిందిగా దేవుడు నన్ను ఆదేశిస్తున్నాడు. CDTel 398.2

యూనియన్ కాన్ఫరెన్స్ రికార్డ్ (ఆ స్టైలేషియన్) జూలై 28, 1899 CDTel 398.3

664. మనం మాంసాహారం విడిచి పెట్టాల్సిన సమయం దగ్గరలోనే ఉన్నదని నాకు వచ్చిన వెలుగు చెబుతున్నది. పాలు సయితం విసర్జించాల్సి వస్తుంది. వ్యాధులు పెరిగిపోతున్నాయి. భూమి పై దేవుని శాపం ఉంది. మనుషుడే దానికి కారణం. మనుషుల అలవాట్లు అభ్యాసాలు భూమి పరిస్థితిని మార్చినందువల్ల మానవ కుటుంబం నివసించటానికి మాంసం స్థానే వేరే ఆహారం తయారు చేసుకోవాలి. దేవుడు మనకు మరోదాన్నిస్తాడు. CDTel 398.4

(1870)2T 404,405 CDTel 398.5

665. మీరు తినే మాంసం ఎలాంటిదో మీరు తెలుసుకోగలిగితే, ఏ జంతువుని వధించి దాని మాంసం సంగ్రహిస్తారో దాన్ని బతికి ఉన్నప్పుడు చూస్తే, మీరు దాని మాంసాన్ని అసహ్యించుకుంటారు. మీరు ఏ జంతువుల మాంసం తింటారో అవి ఎంతగా వ్యాధిగ్రస్తమౌతాయంటే, అలా విడిచి పెడితే అవి తమంతట తామే మరణిస్తాయి. అయితే వాటిలో ప్రాణమున్నంత సేపు చంపి వాటిని బజారుకి తెస్తారు. మీరు మీ వ్యవస్థలోకి చెడు ద్రవాల్ని, విషాల్ని ప్రత్యక్షంగా తీసుకుంటారు. అయినా అది మీకు తెలియదు. CDTel 398.6