Go to full page →

కారణాన్ని గర్తించటం లేదు CDTel 406

(1905) M.H.315 CDTel 406.1

689. మాంసాహారం ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. కాని అది హానికరం కాదనటానికి ఇది నిదర్శనం కాదు. తమ రక్తాన్ని విషంతో నింపి తమకు బాధను కలిగిస్తున్నది తాము తింటున్న మాంసం అంటే నమ్మేవారు ఎక్కువమంది ఉండరు. CDTel 406.2

(1896) E.ఫ్రమ్ U.T.8 CDTel 406.3

690. ఈ అంశాన్ని నాకు వివిధ దృష్టికోణాల నుంచి సమర్పించటం జరిగింది. మాంసాహారం కలిగించే మరణాల్ని మనుషులు గ్రహించటంలేదు. అదే జరిగితే చచ్చిన జంతువుల మాంసం తినటాన్ని సమర్థిస్తూ తర్కించటం మనం వినం. చచ్చినవాటి మాంసం మన ఆహారపదార్థాల్లో చేర్చకుండా మనం తినటానికి మన భోజన బల్లల పై పెట్టటానికి ఎన్నో మంచి ఆహారపదార్థాలు ఉన్నాయి. CDTel 406.4

[C.T.B.H.48] (1890) C.H.115 CDTel 406.5

691. కేవలం మాంసాహారం కలుగజేసే వ్యాధుల వల్ల అనేకమంది మరణిస్తారు. దానికి వాస్తవ కారణం వారికిగాని లేదా ఇతరులుకి గాని తెలియదు. కొందరు దాని ఫలితాన్ని తక్షణమే గ్రహించరు. అయితే అది హానికరం కాదనటానికి ఇది నిదర్శనం కాదు. వ్యవస్థపై దాని పనిని అది చెయ్యవచ్చు. అయినా బాధితుడికి అది తెలియక పోవచ్చు. CDTel 406.6

(1868) 2T 61 CDTel 406.7

692. నీ మాంసాహారాన్ని సమర్థించుకుంటూ, ” ఇతరులికి ఎంత హానికరంగా ఉన్నా, అది నాకు హాని చెయ్యదు, ఎందుకంటే నా జీవితమంతా నేను దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాను” అని నీవు పదేపదే అంటున్నావు. కాని మాంసాన్ని పూర్తిగా విసర్జించి ఉంటే నీవు మరెంత ఆరోగ్యవంతంగా ఉందువో నీకు తెలియదు. CDTel 406.8