Go to full page →

ఒకసారి ఉపయోగించిన ఆహారం ఎందుకు తినాలి? CDTel 411

ఉత్తరం 72, 1896 CDTel 411.8

703. జంతువుల ఆహారం కూరగాయలు, గింజలు. మనం కూరగాయల్ని తినకముందు వాటిని జంతువులుగా మార్చాలా? వాటిని జంతువుల శరీర వ్యవస్థలోకి చొప్పించాలా? ఆదామవ్వలకి పండ్లని స్వాభావిక స్థితిలో ఆహారంగా దేవుడు సమకూర్చాడు. కావలి కోయటానికి, సేద్యం చెయ్యటానికి ఆదాముకి “అది మీకాహారమగును” అని చెప్పి ఏదెను తోటనిచ్చాడు. CDTel 411.9

(1905) M.H.313 CDTel 411.10

704. మాంసం తినేవారు గింజలు కూరగాయల్ని పరోక్షంగా తింటున్నారు. ఎందుకంటే పెరుగుదలనిచ్చే పోషకాల్ని వీటినుంచి జంతువులు తీసుకుంటాయి. గింజలు, కూరగాయల్లోని జీవశక్తి వాటిని తినే ప్రాణికి మార్పిడి అవుతుంది. దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆహారాన్ని ప్రత్యక్షంగా తినటం ద్వారా దాన్ని పొందటం మరెంత మంచిది! CDTel 411.11