Go to full page →

సెవెంతుడే ఎడ్వంటిస్టు సంస్థల్లో ప్రగతిశీల ఆహార సంస్కరణ CDTel 422

గమనిక: తొలినాళ్లలో సెవెంతుడె ఎడ్వంటిస్టు వైద్య సంస్థల్లో రోగులకి సహాయకులకి కొద్దీ గొప్పో మాంసాహారం ఇచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. ఆరోగ్యకరమైన జీవనంలోని ఈ దశ తాలూకు సంస్కరణ ప్రగతిశీల కృషి, పురాతన సంస్థల్లో దీర్ఘ పోరాటం అనంతరం మాంసాహారం క్రమేపి విసర్జించబడింది. బేటిల్ క్రీక్ సేనిటేరియమ్ విషయంలో ఈ చర్య 1898 లో తీసుకోటం జరిగింది. ఇది ఈ అధ్యాయంలో (722) శ్రీమతి వైట్ సలహాలకు స్పందిస్తూ తీసుకున్న చర్య. సెయిస్ట్ హెలీనా సేనిటేరియమ్ లో ఈ మార్పు 1903 లో జరిగింది. ఇప్పటికే శాఖాహారం విషయంలో జ్ఞానం విస్తరించింది. అతిథులికి కూడా మాంసాహారం తిరస్కరించటం జరిగింది. క్రితంలో కన్నా ఇప్పుడు ఈ మార్పు చెయ్యటం సులభమయ్యింది. దాదాపు ఈ సమయంలో స్థాపితమైన కొత్త వైద్య సంస్థల్లో మాంసం ఇవ్వలేదన్న విషయం ప్రాచీన వైద్యశాలల నిర్వాహకులకి ఎంతో ఆనందం కలిగించింది. CDTel 422.1

మన సంస్థల్లో మాంసం వాడకాన్ని మానటం గురించి, ఆహారం విషయంలో ప్రగతిశీల సంస్కరణ ఆవశ్యకతను గురించి జరిగిన పోరాట చిత్రాన్ని శ్రీమతి వైట్ అనేక రచనల్లో వివరించిన రీతిగా చూడకుండా మాంసాహారం అంశం పై వస్తున్న ఉపదేశం సంపూర్తి కాదు. మాంసాహార సమస్య తాలూకు ఈ దశను అధ్యయనం చేసేటప్పుడు ఈ విషయాల్ని అనేకమైన ఈ వాక్యాల్ని రచించిన కాలాన్ని పాఠకుడు మనసులో ఉంచుకోటం అవసరం-సంకలన కర్తలు] CDTel 422.2