Go to full page →

అనేకులు జ్ఞానం పొందుతారు CDTel 460

(1900) 6T 378,379 CDTel 460.3

762. ఆరోగ్య సంస్కరణ ఆచరణాత్మక ప్రభావం ద్వారా శారీరక, మానసిక, నైతిక భ్రష్టతనుంచి అనేకుల్ని కాపాడవచ్చునని ప్రభువు నాకు కనపర్చాడు. ఆరోగ్యం పై ఉపన్యాసాలు ఇవ్వటం జరుగుతుంది. ప్రచురణలు వృద్ధిచెందుతాయి. ఆరోగ్య సంస్కరణ నియమాల్ని జనులు సంతోషంగా స్వీకరించటం జరుగుతుంది. అనేకులు జ్ఞానవికాసం పొందుతారు. ఆరోగ్యసంస్కరణకు సంబంధించిన ప్రభావాలు వెలుగును ఆకాంక్షించే వారందరికి దాన్ని ఆకర్షణీయం చేస్తాయి. వారు ఈ కాలపు ప్రత్యేక సత్యాల్ని అంగీకరించే దిశగా క్రమక్రమంగా అడుగులు వేస్తారు. ఈ రకంగా సత్యం, నీతి కలుసుకుంటాయి.... CDTel 460.4

సువార్త, వైద్యమిషనెరీ సేవ రెండూ కలిసి పురోగమించాలి. సువార్తతో వాస్తవిక ఆరోగ్య సంస్కరణ సూత్రాలు ముడిపడి ఉండాలి. క్రైస్తవాన్ని వ్యావహారిక జీవితంలోకి తేవాలి. సంస్కరణ సేవను అంకిత భావంతో చెయ్యాలి. పతిత మానవుడి పట్ల పొంగిపారుతున్న దైవ ప్రేమే బైబిలు మతం. సత్యాన్ని వెదకుతున్న వారిని, ఈ యుగంలో తమ పాత్రను సరిగా నిర్వహించాలని ఆకాంక్షించే వారిని, ప్రభావితం చెయ్యటానికి దైవప్రజలు తిన్నని మార్గాల్లో ముందుకి సాగాల్సి ఉంది. ఆరోగ్యసంస్కరణ నియమాల్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించటానికి ప్రజల్ని నడిపించటానికి మన శక్తిమేరకు కృషి చేస్తూ, మనం ఆచరిస్తూ, వాటిని వారికి సమర్పించాలి. CDTel 460.5