Go to full page →

జీవ వృక్షం ఆకులు CDTel 466

(1902) 9T 168 CDTel 466.1

772. ఆరోగ్య సంస్కరణ సందర్భంగా చెయ్యాల్సిన పనిని చెయ్యటంలో జాప్యం జరగకూడదని నాకు ఉపదేశం వచ్చింది. ఈ పని ద్వారా మనం రాజమార్గాల్లోను ముళ్లకంచెల్లోను ఉన్న ఆత్మల్ని చేరాల్సి ఉంది. ప్రస్తుత కాల సత్యాన్ని అంగీకరించి ఆచరించే అనేక ఆత్మలు మన సేనిటేరియాల్లో ఉన్నారన్న ప్రత్యేక వర్తమానం నాకందించటం జరిగింది. తమ శరీరాల్ని గూర్చిన శ్రద్ధ తీసుకుంటూ అదే సమయంలో విశ్వాసపరంగా ఎలా స్థిరంగా నిలవాలో ఈ సంస్థల్లోని పురుషులకు స్త్రీలకు బోధించాలి. దైవ కుమారుని శరీరాన్ని తినటం ఆయన రక్తాన్ని తాగటం అంటే ఏంటో వారికి బోధించాలి. క్రీస్తంటున్నాడు, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి.” యోహాను 6:63. CDTel 466.2

మన సేనిటేరియాలు వైద్యమిషనరీ సేవకు శిక్షణ నిచ్చే విద్యాలయాలు కావాలి. పాప వ్యాధితో విసిగి వేసారిన ఆత్మలకు అవి సమాధానం నిరీక్షణ క్రీస్తు పై విశ్వాసం పునరుద్ధరించే జీవ వృక్షపు ఆకుల్ని తేవాల్సి ఉంది. CDTel 466.3